పాకిస్తాన్ లో 140 రూపాయిలకు చేరిన లీటర్ పాలు

 

లాహోర్, సెప్టెంబర్ 11 (globelmedianews.com)
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కంటే మన దగ్గరే పెట్రోల్ రేటు ఎక్కువని.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడలా.. సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. కానీ పాకిస్థాన్‌లో లీటర్ పాల ధర పెట్రోల్ ధరనుమించపోయింది. మొహార్రం సందర్భంగా  పాకిస్థాన్‌లో లీటర్ పాలను రూ.140కి విక్రయించారు. కరాచీలో పాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ ధరను పెట్టి మరీపాలను కొనాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ 90 పాకిస్థానీ రూపాయలు ఉండగా.. డీజిల్ రూ.91 రూపాయలు ఉంది.
పాకిస్తాన్ లో 140 రూపాయిలకు చేరిన లీటర్ పాలు

వాస్తవానికి లీటర్ పాలను గరిష్టం రూ.94కే విక్రయించాలని ప్రభుత్వంఆదేశించింది. రిటైల్ ధరను రూ.110గా నిర్ణయించారు. కానీ దుకాణదారులు లీటర్ రూ.140 చొప్పున పాలను విక్రయించారు.మొహర్రం సందర్భంగా కరాచీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పాలు,పళ్లరసాలు, చల్లటి నీళ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాల డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఇదే అదనుగా వ్యాపారులు కృతిమ కొరత సృష్టించారు. దీంతో పాల ధరలు పెరిగాయి.జీవితంలో ఇప్పటివరకూ పాల ధర ఇంత పలకడం ఎప్పుడూ చూడలేదని కరాచీ వాసులు వాపోతున్నారు. పాల ధరను నియంత్రించడానికి కరాచీ కమిషనర్ డాక్టర్ ఖటూ మల్ జీవన్ చర్యలేవీ తీసుకోవడం లేదననివాపోతున్నారు.

No comments:
Write comments