15 కోట్లు దాటేసిన వరుణ్ మూవీ

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 23, (globelmedianews.com)
వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చివరి నిమిషంలో పేరు మార్చుకుని గద్దలకొండ గణేష్‌గా థియేటర్స్‌లోకి వచ్చింది. అయినా కూడా ఆ సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. దాంతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టీప్లెక్స్ వరకు కూడా గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ దందాకి అడ్డులేకుండా పోయింది. దీంతో మొదటి రోజే 5.5 కోట్ల భారీ డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన గద్దలకొండ గణేష్ శని,ఆదివారాల్లో కూడా బాగానే సంపాదించాడు. దాంతో ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 15.19 కోట్లు కొల్లగొట్టింది.ఈ సినిమాకి నైజం ఏరియాలో మంచి థియేటర్స్ దక్కాయి. అలానే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడం వల్ల కూడా టికెట్ కౌంటర్ దగ్గర గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతుంది. 
15 కోట్లు దాటేసిన వరుణ్ మూవీ

ఒక్క నైజాంలోనే మూడు రోజులకు గాను నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇక ఇది మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ అయినట్టు లేదు. అందుకే అక్కడ ఈ సినిమా కేవలం 1.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో అక్కడ ఈ సినిమా ఫుల్‌రన్‌లో స్వల్పంగా నష్టాలు మిగిల్చేలా ఉంది. మెగా ఫ్యాన్‌బేస్ ఎక్కువగా ఉన్న వెస్ట్ గోదావరి, నెల్లూరు వరకు మాత్రం ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. సో, సైరా వచ్చేవరకు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏది థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా కొనుకున్నవాళ్లందరికి కూడా మంచి లాభాలే అందించే అవకాశం ఉంది.ఈ సినిమాలో గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ నటన, పూజాహెగ్డే గ్లామర్, రెండు పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక క్లయిమాక్స్‌లో ఎమోషన్ కూడా సినిమాకు మంచి టాక్ రావడానికి, కలెక్షన్స్ స్టడీగా ఉండడానికి కారణం అయ్యింది. అయితే ఈ మధ్య సినిమాలు ఎక్కువగా మొదటి వీకెండ్ తరువాత డ్రాప్ చూపిస్తున్నాయి.మరి ఈ సినిమా మండే టెస్ట్‌‌లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది కూడా ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూస్తే హరీష్ శంకర్ కష్టం, వరుణ్ తేజ్ నమ్మకం, కొత్త బ్యానర్ 14 రీల్స్ అన్నిటికి మంచి ఫేవరబుల్ గిఫ్ట్ అందించాడు గద్దలకొండ గణేష్.

No comments:
Write comments