ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 రూపాయలు చెల్లించాలి

 

ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
షాద్ నగర్ సెప్టెంబర్ 20 (globelmedianews.com)  
షాద్ నగర్  నియోజక వర్గంలోని ఆరు మండలంలోని  పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఆరు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని శుక్రవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో  స్థానిక అంబేద్కర్చౌరస్తా లో రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం  ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ..ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా అనంతరం వినతి పత్రం ఆశావర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు కవిత, సాయిబాబు   పి.శ్రీను నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెండింగ్ జీతాలు ఆరు నెలల నుంచిఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. 
ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 రూపాయలు చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారో ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారుచెప్పిన మాటలు నీటిమీద రాతలు గా మిగిలాయని వారు ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.తెలంగాణ సర్కార్ ఆశ వర్కర్ల చేత ఎట్టి చాకిరి చేయించుకుంటున్నారు అని వారు ఆరోపించారు.. గ్రామాలలో ఆశావర్కర్లు వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పుట్టిన పిల్లలకు మంచిసూచనలు సలహాలు ఇస్తూ వాళ్లను ఆరోగ్యంగా ఉండడానికి మంచి కృషి చేస్తున్నారని వారు గుర్తు చేశారు. ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికైనా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని వారు అన్నారు. కనీస వేతనాలు చెల్లించకపోతే భవిష్యత్ కర్తవ్యాన్ని రూపొందించుకొని ఆందోళనకార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల రాధిక సుజాత వసంత అనిత శ్రీలత సరిత  రజిత.సువర్ణ విజయలక్ష్మి జ్యోతి  శైలజ పార్వతమ్మ వెంకటమ్మజంగమ్మ వెంకటమ్మ అనిత రామేశ్వరి  పాల్గొన్నారు.

No comments:
Write comments