అండర్ -19 క్రికెట్ విద్యార్థి ఆత్మహత్య

 

ఎమ్మిగనూరు సెప్టెంబర్ 7, (globelmedianews.com)
పట్టణంలో రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ అదండర్ 19 రాష్ట్ర స్థాయి క్రికెట్ కు ఎంపిక అయిన హర్షఅనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మిగనూరు పట్టణం లోని ఎస్.ఎమ్.టీ కాలనీకి చెందిన సరస్వతి, కాశిం నాయుడు లకు ఇద్దరు కుమారులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు హర్ష. 
అండర్ -19 క్రికెట్ విద్యార్థి ఆత్మహత్య

క్రీడల్లో ప్రతిభ వంతుడైన హర్ష ఆత్మహత్య చేసుకోడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించు కొనేక పోతున్నారు. ఐతే ఇతడు తాజాగా అండర్-14 జట్టులో కూడా ఎంపిక అయ్యాడు. అండర్ 16 లో బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల లో ప్రతిభ కనపరిచాడు .ఆరు మ్యాచులు ఆడి 14 వికెట్లు 50 పరుగులు చేశారు. శరీర దృఢత్వం, మానసిక పరిపక్వత చెందిన హర్ష ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడు కాదని కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐతే ఈ ఆత్మహత్యకుకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.

No comments:
Write comments