తెలంగాణలో తగ్గిన 244 ప్రభుత్వ పాఠశాలలు, 71,810 మంది విద్యార్థులు

 

పాఠశాల విద్యపై రెండేళ్ల గణాంకాలు అసెంబ్లీకి సమర్పణ
హైదరాబాద్ సెప్టెంబర్ 20, (globelmedianews.com)
రాష్ట్రవ్యాప్తంగా 2017-18 విద్యా సంవత్సరం కంటే 2018-19లో 244 పాఠశాలలు తగ్గిపోయాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 34, ప్రైవేట్‌ పాఠశాలలు 210. అదే సమయంలో సర్కారు విద్యాసంస్థల్లో 71,810 మంది విద్యార్థులు తగ్గిపోగా, ప్రైవేట్‌లో 45,990 మంది పెరిగారు. శాసనసభలో విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను సమర్పించింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో మొత్తం 2,38,878 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.2017-18 కంటే 2018-19లో బాలికల సంఖ్య 20,289 మందికి తగ్గింది. 2017-18లో 1-10 తరగతుల్లో అమ్మాయిలు 28,31,466 మంది ఉండగా గత ఏడాదిలో 28,11,177 మందే ఉన్నారు.
తెలంగాణలో తగ్గిన 244 ప్రభుత్వ పాఠశాలలు, 71,810 మంది విద్యార్థులు

వయోజనులను అక్షరాస్యులుగా చేసేందుకు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పఢనా లిఖనా అభియాన్‌’ కింద ఈ సంవత్సరం రాష్ట్రంలో 2లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాక్షర భారత్‌ పథకం కింద 2017-18లో 5.20లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యం పెట్టుకోగా 2లక్షల మందిని, 2018-19లో 99వేలకు బదులు 93వేల మందిని అక్షరాస్యులుగా మార్చామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడిన వారిలో 53.40లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని పేర్కొంది.

No comments:
Write comments