286 ఆర్డర్లు తారుమారు...

 

హైద్రాబాద్, సెప్టెంబర 30 (globelmedianews.com)
తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ కుంభకోణంలో డైరెక్టర్ దేవికారాణి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిసాయి. 286 ఆర్డర్లను సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్ తారుమారు చేసినట్లు విచారణలో తేలింది. ఏసీబీ అధికారులు దేవికారాణి పేషీ సిబ్బంది స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశారు. ఆర్డర్లకు సంబంధించిన రికార్డ్స్‌ని తారు మారు చేసినట్లుగా సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్ చెప్పినట్లు తెలుస్తోంది. డిస్పెన్సరీ నుంచి వచ్చిన ఆర్డర్స్‌ను రద్దు చేసి.. వాటి స్దానంలో తమకు నచ్చిన ఆర్డర్స్ పెట్టినట్లు తేలిందట. 26 ఆర్డర్స్‌ను పూర్తిగా మార్చేసి.. తర్వాత డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఫార్మాసిస్టు పావని కూడా రికార్డులను తారుమారు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
286 ఆర్డర్లు తారుమారు...

ఒరిజినల్ డాక్యుమెంట్లను రికార్డుల నుంచి తొలగించి.. వాటి స్థానంలో ఫేక్ డాక్యుమెంట్లతో ఫైల్స్ పెట్టినట్లు పావని అధికారులకు చెప్పారట. జాయింట్ డైరెక్టర్ పద్మ ఇచ్చిన సూచనలతో.. ఈ డాక్యుమెంట్లను తారు మారు చేసినట్లు తేలిందట. పావనితో పాటు శివ, ప్రభు లింగలు కలిసి తమకు ఇష్టమొచ్చిన లెక్కలు రాసి ఒరిజినల్ రిజిస్టర్‌లో పెట్టినట్లు తేలింది. నకీలీ ఇండెండ్‌తో తయారు చేసి.. దానిని ఓమ్నీ ఫార్మాకు పంపించారు. పాత డేట్స్‌తో వచ్చిన ఈ నకిలీ ఇండెండ్స్‌ను ఓమ్నీ మెడి ఫార్మా ఓకే చేసింది.ఆగస్టు 2018లో ఇండెండ్స్‌కు వచ్చినట్లు పద్మకు ఫార్మా యజమాని నాగరాజు సమాచారం ఇచ్చారు. ఇదే సమాచారాన్ని డైరెక్టర్ దేవికారాణికి కూడా చెప్పారు. డైరెక్టర్ పీఏ ప్రమోద్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించారు.. ఆరు తప్పుడు బిల్స్‌ను గుర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ, లెబర్ అధికారి.. ఈ తప్పుడు బిల్స్‌పై పూర్తి స్దాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ అధికారి ఆదేశాలను కూడా పట్టించుకోని దేవికారాణితో పాటూ పgద్మలపైన ఛార్జ్ మెమోలను జారీ చేశారు.ప్రిన్సిపాల్ సెక్రటరీ హెచ్చరించినా దేవికారాణి వెనక్కు తగ్గలేదు. ఓమ్మీ మెడి ఫార్మా పెట్టిన తప్పుడు బిల్స్‌ను ఓకే చేశారు. మొత్తం ఆరు బిల్స్‌ను ఒకేసారి పాస్ చేశారు. తర్వాత దేవికారాణి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కృష్ణ.. ఈ బిల్స్ పాస్ చేయకుండా పక్కన పెట్టారు. దీంతో కృష్ణను ఫార్మా యాజమాని నాగరాజు బెదిరించారట. అంతేకాదు డైరెక్టర్‌తో చెప్పి ఉద్యోగం తీయిస్తానని హెచ్చరించారట. అప్పటికీ మాట వినకపోవడంతో డైరెక్టర్ దేవికా రెడ్డి బిల్స్ ఓకే చేయమని కృష్ణపై ఒత్తిడి తీసుకురావడంతో పాస్ చేసినట్లు తేలింది.

No comments:
Write comments