35 ఏళ్ల నుంచి ఒక్కటే సిలబస్

 

విద్యార్ధులకు తీవ్ర నష్టం...
అదిలాబాద్, సెప్టెంబర్ 5, (globelmedianews.com)
ముప్పై అయిదు ఏళ్ల  నుంచి కోర్సులలో కనిపించని మార్పుతో విద్యార్ధులకు తీరని నష్టం జరుగుతోంది.రాష్ట్ర ప్రభుత్వం 1984-85లో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ కోర్సులనే ఇప్పటికీ కొనసాగించడం ప్రధాన సమస్యగా మారింది. ఎలాంటి యంత్ర పరికరాలు సమకూర్చకపోవడం, నేటి సాంకేతిక మార్పులకనుగుణంగా నూతన కోర్సులను అమలు చేయకపోవడంతో ఆదరణ కరవవుతోంది.  పదోతరగతిలో సమగ్ర మూల్యాంకన విధానం అమలవుతోంది. ఈ పరిస్థితిలో సాధారణ విద్యకుతోడు వృత్తి విద్య పాఠ్యాంశాలను పటిష్టంగా విద్యార్థులకు అమలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బోధకులు తూతూమంత్రంగా పాఠాలు బోధించి కేవలం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం వరకే పరిమితమవుతున్నారు. ఉన్నతాధికారులు సైతం శ్రద్ధ వహించకపోవడంతో జిల్లాలో కొన్నిచోట్ల ఈ విద్య పడకేసింది.ఆ సమయంలో 26 మందిని వృత్తి విద్య బోధకులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. 
35 ఏళ్ల నుంచి ఒక్కటే సిలబస్

వీరిలో కొందరిని 2009లో క్రమబద్ధీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1986-87లో 11 ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్య బోధనను ప్రవేశపెట్టారుప్రస్తుతం చెన్నూరు, తపాల్‌పూర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు, కాగజ్‌నగర్, సిర్పూరు, ఆదిలాబాద్, ఖడెం, ఇచ్చోడ, కౌట(బి), ముథోల్‌ పాఠశాలల్లో వృత్తి విద్య బోధననుఎంపిక చేసిన పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు బోధకులు ప్రయోగాత్మక బోధనలు చేపట్టాలి. పదో తరగతి పరీక్షలతో పాటు ఇవి రాసి ఉత్తీర్ణులైతే ఆ విద్యార్థికి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. అది స్వయం ఉపాధికి సంబంధించి రుణాలు పొందడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి దశలోనే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలుగుతుంది. ఈ కోర్సులను బోధించేందుకు బోధకులున్నా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో వాటికి కాలపట్టికను కేటాయించడం లేదు. దీంతో సదరు ఉపాధ్యాయులు తమ విధులకు బదులు పాఠశాలల్లో ఇతర పనులు నిర్వహిస్తున్నారు. మొదట్లో బోధకులకు తరగతికి రూ.15 చొప్పున ఏడాదికి రూ.600 మించకుండా వేతనాలు చెల్లించేవారు. దీంతో ఉన్న పరికరాలకు మరమ్మతులు చేయించలేక విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధనలు చేపట్టలేని దుస్థితి. తూతూమంత్రం బోధనలు, పరీక్షలు జరిపి ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో అత్యధిక శాతం పేదలే. వీరికోసం వృత్తివిద్యను ప్రవేశపెట్టారే తప్ప పాఠశాలల్లో సరైన మౌలిక సౌకర్యాలు, నిధులు సమకూర్చటం లేదు. ఏళ్లనాటి సిలబస్‌నే కొనసాగిస్తున్నారు. నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టి, సాంకేతిక మార్పుకు తగినట్లుగా పరికరాలు అందజేస్తే విద్యార్థులకు మంచి బోధనను అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులకు తోడు, డ్రాపౌట్‌ పిల్లలకు వృత్తి విద్య అవకాశాన్ని కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

No comments:
Write comments