ట్విట్టర్ లో మోడీ హవా 4.9 కోట్ల మంది ఫాలోయర్స్

 

న్యూఢిల్లీ సెప్టెంబర్ 10 (globelmedianews.com)
భారత ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్‌లో ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఆయనను ట్విట్టర్‌లో 4.9 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న నేతల్లోమోదీ మూడో స్థానంలో ఉన్నారు. 
ట్విట్టర్ లో మోడీ హవా 4.9 కోట్ల మంది ఫాలోయర్స్

ఆయన కంటే ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(10.8 కోట్ల మంది ఫాలోవర్స్), ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(6.4 కోట్ల మందిఫాలోవర్స్) ఉన్నారు.భారత ప్రధానుల్లో అత్యధిక ఆకర్షణ గల నేత గానూ మోదీ ఉన్నారు. ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు, ఆయన తీసుకునే సాహసోపేత నిర్ణయాలు, వ్యాక్చాతుర్యం,వస్త్రధారణ.. ఇలా ఆయన చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది.

No comments:
Write comments