17 మంది చక్రం తిప్పడం ప్రారంభించారు...

 

బెంగళూర్, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
వాళ్లంతా అనధికారిక ఎమ్మెల్యేలే. అనర్హత వేటు పడినా వారంతా నియోజకవర్గాన్ని వదలడం లేదు. తమ పట్టును కోల్పోకూడదన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన పడింది.అయితే ఈ పదిహేడు మంది ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటును తొలగించాలని, స్పీకర్ నిర్ణయం సరికాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. అయితే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయన్న సమాచారం ఉండటంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 17 మంది చక్రం తిప్పడం ప్రారంభించారు...

అనర్హత వేటు పడినా అనధికారిక ఎమ్మెల్యేలుగానే నియోజకవర్గాల్ల చెలామణి అవుతున్నారు.ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగిరం జరగాలని కోరుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించగలిగితే ఉప ఎన్నికలు జరిగినా తమ వారసులను పోటీకి దింపైనా గెలిపించుకోవచ్చన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. అందుకోసమే వారు ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై వత్తిడి తెస్తున్నారు. ఇటీవల అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించిన అధికారుల బదిలీలపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈమేరకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తో కూడా భేటీ అయ్యారు. ఉప ఎన్నికలు వచ్చినా తమ పట్టు కోల్పోకూడదన్న కారణంగానే తమను అనధికారికంగా ఎమ్మెల్యేలుగా చూడాలని వారు కోరారు. కొందరు మంత్రులు తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ భవిష్యత్తు ఏమిటో కూడా తేల్చాలని వారు యడ్యూరప్పను డిమాండ్ చేసినట్లు తెలిసింది. యడ్యూరప్ప వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

No comments:
Write comments