9 కోట్లకు 16.50 లక్షల భూమి

 

నల్గొండ, సెప్టెంబర్ 14, (globelmedianews.com)
ముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో 2.30 ఎకరాల భూమిని యాదాద్రి టెంపుల్ డెవలప్‌‌మెంట్ అథారిటీ(వైటీడీఏ) చిన్న జీయర్ స్వామికి చెందిన ఎడ్యూకేషన్‌‌ ట్రస్టుకు రిజిస్ట్రేషన్ చేసింది.తెలంగాణఏర్పాటు తరువాత యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 2014లో  వైటీడీఏ  ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకోసం రూ.1200 కోట్లు కేటాయించారు. ధార్మిక అవసరాల కోసమని యాదగిరిగుట్ట, పరిసర ఆరు గ్రామాల పరిధిలో దాదాపు 80 సర్వే నంబర్లలో 2028.37 ఎకరాలను సేకరించింది.
9 కోట్లకు 16.50 లక్షల భూమి

2015లో ఇక్కడ ఎకరాకు రూ.3 లక్షలు ఉండగా మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి ఎకరం రూ.10.50 లక్షల చొప్పున కొన్నది. తరువాత రియల్ భూమ్‌‌తో యాదాద్రి పరిసరాల్లో ఎకరా రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ పలుకుతోంది. పెద్దగుట్ట పరిధిలోని సర్వే నంబర్ 172లోని 19.14 ఎకరాల్లోని 172 (బీ)కి చెందిన 2.30 ఎకరాల భూమిని రూ.6.50 లక్షలకుఎకరా చొప్పున రూ. 16.50 లక్షలకు వైటీడీఏ అమ్మింది. మార్కెట్లో ఈ భూమి ధర దాదాపు రూ. 9 కోట్ల వరకూ ఉంటుంది. రూల్స్ ప్రకారం కొన్న ధరకంటే తక్కువ రేటుకు భూమి అమ్మకూడదు.అలాగే డెవలప్ చేసిన భూమిని ఎకరాల చొప్పున కూడా అమ్మవద్దు. అయితే రూల్స్ రూపొందించిన సర్కారే వాటిని ఇలా బ్రేక్ చేసింది. ఈ నెల 5న త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజజీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి(జీవా)కి రిజిస్టర్ చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌‌కు చిన్న జీయర్ రాలేదు. ఆయన తరుపున జీ వెంకట్‌‌రావు ఈ నెల 5నయాదగిరిగుట్టకు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. వైటీడీఏ ఇన్‌‌చార్జీ సెక్రటరీ ఎన్ వెంకన్నగౌడ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆగస్టు 14న యాదగిరి గుట్టలో నాలుగు ఎకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ  చిన్న జీయర్ స్వామి లేఖ రాసినట్లు రిజిస్ట్రేషన్ పేపర్లో వైటీడీఏ పేర్కొంది

No comments:
Write comments