కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య దిగ్భ్రాంతి

 

న్యూఢిల్లీ సెప్టెంబర్ 16 (globelmedianews.com)
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే ఏపీ గవర్నర్ హరిచందన్ కోడెల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 
కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య దిగ్భ్రాంతి

స్పీకర్గా కోడెల సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని గవర్నర్ పేర్కొన్నారు. కోడెల శివప్రసాదరావు (72) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని తన ఇంట్లో ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్సత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

No comments:
Write comments