వైసీపీ సర్కార్‌పై నిప్పులుచెరిగిన చంద్రబాబు

 

కాకినాడ సెప్టెంబర్ 5  (globelmedianews.com)
వైసీపీ సర్కార్‌పై మాజీ సీఎం చంద్రబాబు నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలన అప్రదిష్టను మూటకట్టుకుందన్నారు. ఇది విధ్వంసకర ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. కాకినాడలోటీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. చంద్రబాబు, యనమల, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జవహర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వందరోజుల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న సీఎం చరిత్రలో మరొకరు లేరని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మనకు వేధింపులు పెరిగే కొద్దీ.. వైసీపీ ప్రభుత్వానికి నూకలుచెల్లే రోజు దగ్గరపడినట్టు లెక్క అన్నారు. 
వైసీపీ సర్కార్‌పై నిప్పులుచెరిగిన చంద్రబాబు

ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాడులకు పాల్పడుతున్నారంటే వైసీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడునియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వివరించారు. నెలలు గడుస్తున్నా సొంత బాబాయిని ఎవరు హత్య చేశారో తేల్చడంలేదని విమర్శించారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రంమొత్తం రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ బాధితుల కోసం... పునరావాస కేంద్రం పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి,డీజీపీకి చెప్పినా దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్టిమేటం ఇచ్చినా ఆత్మకూరు బాధితులను తిరిగి వారింటికి చేర్చలేదన్నారు. పోలీసులకు సవాల్‌ చేస్తున్నా.. మీరు చేయలేని పని చలోఆత్మకూరు పేరుతో తాము చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకు గట్టిగా చెబుతున్నా. తాత్కాలిక పోస్టింగ్‌ల కోసం టీడీపీ కార్యకర్తలను వేధించొద్దని హెచ్చరించారు. జగన్‌కు దమ్ముంటే తనబాబాయ్‌ని చంపిన నిందితులను బయటపెట్టాలని సవాల్ విసిరారు. చేతకాకుంటే కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

No comments:
Write comments