పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి

 

వైకుంఠ ధామం పనుల పై సంతృప్తి
- జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్ రెడ్డి
కామారెడ్డి  సెప్టెంబర్ 20 (globelmedianews.com)
పల్లెలన్నీ  పరిశుభ్రం తో , పచ్చదనంతో కళకళలాడాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.  ఆయన ఈరోజు 30 రోజుల ప్రణాళిక లో భాగంగా కామారెడ్డి జిల్లా లోనినిజాంసాగర్  మండలము లోని  గోర్గల్  గ్రామంలో  జరుగుతున్న పనులను  పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరూ పై ఉందని అన్నారు. 
పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి

ప్రతి ఇంట్లో ఒక కరివేపాకు, కృష్ణ తులసి మొక్కలు ఉండేవిధంగా నర్సరీలలో మొక్కలను పెంచాలని సూచించారు.అటవీ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన మంకీ ఫుడ్ కోర్టు నందు స్థానిక ఎం.పీ.పీ. జ్యోతి దుర్గా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్  తో కలిసి పండ్ల మొక్కలను నాటారు.4000మొక్కలను వారం రోజుల్లోగా నాటాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. పంచాయతీ నందు నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠ దామం పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు, ఈ పనులుత్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, అనంతరం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను,  ఏర్పాటుచేసిన కంచెలను చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులుచాలా బాగున్నాయని స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారుల పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గా రెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు ,  వివిధశాఖలఅధికారులు, ఎంపీడీవో  పర్బన్న  తదితరులు పాల్గొన్నారు..

No comments:
Write comments