జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సిరిసిల్ల అన్ని విధాల అనుకూలం

 

తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి చైర్మన్  చైర్మన్ 
సిరిసిల్ల,  సెప్టెంబర్ 04  (globelmedianews.com)
జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం అధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సిరిసిల్ల అన్నీ విధాలుగా అనుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర  ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య  టి పాపిరెడ్డి తెలిపారు . బుధవారం  తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి చైర్మన్  పాపిరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు  రాష్ట్ర విద్యా మండలి వైస్  చైర్మన్ ఆచార్య వి వెంకట రమణ , జేఎన్టీయూ  ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్  ఈ .సాయి బాబా రెడ్డి , ఎయూ  ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎ క్రిష్ణయ్య లతో కూడిన  కమిటీ జేసి  యాస్మిన్ భాషా, డీఆర్వో ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్దీవో   టి శ్రీనివాస్ రావు లతో కలిసి   సిరిసిల్ల లో పర్యటించారు.  పెద్దూర్ ,సర్దాపూర్ , వెంకటాపూర్ గ్రామాలలో స్థలాలను పరిశీలించారు. 
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సిరిసిల్ల అన్ని విధాల అనుకూలం 

జిల్లా సంయుక్త కలెక్టర్  యాస్మిన్ భాష కళాశాల ఏర్పాటుకు క్షేత్ర స్థాయిలో అనుకూలతలను వివరించారు . సర్దాపూర్ , వెంకటాపూర్ గ్రామాలలోని స్థలం  జేఎన్టీయూ U ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు  అన్నీ విధాలుగా అనువైనదిగా కమిటీ తేల్చింది . కళాశాల స్థాపనకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు . అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు . పరిశీలించిన స్థలాల లో సర్దాపూర్ , వెంకటాపూర్ గ్రామాలలోని సర్వే నెంబర్ 61,247 లలో 88 ఎకరాల స్థలం కళాశాల ఏర్పాటుకు అనువుగా ఉందన్నారు . రవాణా పరంగా చాలా అనుకూలంగా ఉందన్నారు . మౌలిక వసతులు బాగున్నాయన్నారు . సిద్ధిపేట , కామా రెడ్డి , నిజామాబాద్ ,ఆదిలాబాద్ ల విద్యార్థులకు అనువుగా ఉంటుందన్నారు . రెండేళ్లలో రైల్వే లైన్ సిరిసిల్ల కు  రానున్న దృష్ట్యా ఆచార్యలు , విద్యార్థులకు రవాణా పరంగా మరింత అనువుగా ఉండనుదన్నారు . జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ , జేసి  యాస్మిన్ భాషా లు కళాశాల కోసం మంచి స్థలాల ను గుర్తించా రన్నారు .  జిల్లా యంత్రాంగం కళాశాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులను  ఇచ్చిన  నివేదిక తో పాటు తాము గుర్తించిన సానుకూల పరిస్థితులో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు . సాధ్యమైనంత త్వరగా  మోడల్ ఇంజనీరింగ్   కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు . 

No comments:
Write comments