ప్లాస్టిక్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల ను తీర్చిదిద్దుదాం ''సింగిల్ యూజ్'' ప్లాస్టిక్‌ను వాడొద్దు

 

జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్
వేములవాడల సెప్టెంబర్  16  (globelmedianews.com)
రాజన్న సిరిసిల్ల ను  ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ''పరిశుభ్రత కోసం సేవ స్వచ్చత హి సేవ గోడ పత్రికలను జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి ఆవిష్కరించారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ .. రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగం భాగమైందని, దీంతో పర్యావరణానికి హాని కలుగుతుందని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్   అన్నారు .   మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని, పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ''సింగిల్ యూజ్'' ప్లాస్టిక్‌ను వినియోగించడాన్ని ఆపివేయాలని కోరారు. ఈ గాంధీ జయంతి రోజు ప్లాస్టిక్ రహిత రాజన్న సిరిసిల్ల ను రూపొందించేందుకు అంకితభావంతో కట్టుబడి ండాలన్నారు.
 ప్లాస్టిక్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల ను తీర్చిదిద్దుదాం ''సింగిల్ యూజ్'' ప్లాస్టిక్‌ను వాడొద్దు

మున్సిపాల్టీలు, జిల్లా పాలనా సంస్థలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని తగినంత సురక్షితంగా నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీపావళికి ముందే ఎన్‌జిఒలు, కార్పొరేట్ రంగం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11 న ప్రారంభమైన  ''పరిశుభ్రత కోసం సేవ (స్వచ్చత హి సేవ) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ జయంతి నాడు బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాను  ఆయనకు అంకితమివ్వడమే ఆయన నుంచి మనం పొందిన స్ఫూర్తి అని అన్నారు. ప్రజలు తమంతట తామే స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను వినియోగించకుండా ఉండాలని, ఈ సందర్భంగా దేశాన్ని ప్లాస్టిక్ రహిత జిల్లాగా  మార్చేందుకు సరికొత్త విప్లవాన్ని తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్  బి సత్య ప్రసాద్ , ఆర్డీవో టి శ్రీనివాస్ రావు , జెడ్పి సీఈఓ  గౌతమ్ రెడ్డి , డిఆర్డీవో రవీందర్ , అదనపు డిఆర్డీవో కృష్ణ , ఎస్ బి ఎమ్ జిల్ల సమన్వయ కర్త  సురేష్ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు .

No comments:
Write comments