ఆర్టీసీ బస్సు చాలక విద్యార్థులు ఇక్కట్లు

 

వనపర్తి సెప్టెంబర్ 20 (globelmedianews.com)  
ఆర్టీసీ సంస్థ  ఎన్నో బస్సు నడిపిన కూడా అవి విద్యార్థులకు ఏ మాత్రం సరిపోవడం లేదని విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ప్రతిప్రతినిత్యం ఎంతోమంది విద్యార్థులు నాగర్ కర్నూల్ నుండి బిజినపల్లి మీదుగా మహాదేవుని పేట, సాయిన్ పల్లి, మమ్మాయి పల్లి, అల్లిపురం గేట్, బుద్ధారం, గోపాల్పేట, తాడిపత్రి, నరసింగపల్లి గ్రామాల విద్యార్థులు వనపర్తి పట్టణంలోని పాఠశాలలో, కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. 
ఆర్టీసీ బస్సు చాలక విద్యార్థులు ఇక్కట్లు

దీంతో విద్యార్థులంతా ఉదయం ఆయా గ్రామాలలో నీ బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూడడం, వచ్చిన బస్సులో ఒక పక్క కిక్కిరిసిన ప్రయాణికులు మరోపక్క విద్యార్థులు ఉండడంవల్ల బస్సు లో ఎలా ప్రయాణించాలి అంటూ ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సులో వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్య వార్త బ్యూరో శుక్రవారం గోపాల్ పేట లోని బస్టాండ్ లో పరిశీలించగా ఒకపక్క వర్షం నీరు మరోపక్క ప్రయాణికులతో, విద్యార్థులతో నిండిన బస్సులు అగుపించాయి. ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్క గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే ఇక మండలాల్లోని గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దీన్నిబట్టి అట్లే అర్థం అవుతుంది. దీని దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు సరిపడే బస్సులో నడిపించి వారికి సౌకర్యం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.

No comments:
Write comments