పౌరహక్కులకోసం పోరాటం

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తాడేపల్లి సెప్టెంబర్ 11 (globelmedianews.com)
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, పౌరహక్కులు కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.పోలీసులు
అనుమతిచ్చినప్పుడే ఆత్మకూరుకు వెళ్తానన్నారు. ఆత్మకూరు వెళ్లేందుకు తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటానన్నారు. 
పౌరహక్కులకోసం పోరాటం

బాధితులకు న్యాయం జరిగేవరకు తన ప్రయత్నం ఆగదని చంద్రబాబుస్పష్టం చేశారు.ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తే బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. 150 వైసీపీ బాధిత కుటుంబాలు ఇళ్లను విడిచి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేకహృదయవిదారక ఘటనలు జరుగుతున్నా యన్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు భోజనం పెట్టేందుకు కూడాసహకరించడంలేదని, వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

No comments:
Write comments