జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

 

న్యూ డిల్లీ సెప్టెంబర్ 6  (globelmedianews.com)
జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. 95 సంవత్సరాల వయస్సుగల ముగాబే గత కొద్దికాలంగా అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు జింబాబ్వే మీడియా ప్రకటించింది.1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి ముగాబే 37 ఏళ్లుగా అధికారంలోకొనసాగారు. 2017 నవంబర్ 21వ తేదీన ఆర్మీ తిరుగుబాటు చేసి అధికార పగ్గాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 
జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

ముగాబేకు వ్యతిరేకంగా రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలుసామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. 93 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా ముగాబె రికార్డు సృష్టించారు.తనకు పోటీగా వస్తున్నాడంటూ చాలాకాలంగా తన డిప్యూటీగా ఉన్న ఎమర్సన్ ఎంనంగాగ్వాను కేబినెట్ నుంచి తప్పించి తన భార్య గ్రేస్ ముగాబెను తర్వాతి అధ్యక్షురాలిగా చేయాలని ముగాబె భావించడం ఆయన పతనానికి కారణమైంది. 37ఏళ్లుగా జింబాబ్వే అధ్యక్ష పీఠంపై ఉన్న రాబర్ట్ ముగాబె కనిపించాడు. ఆయనను గద్దె దింపడానికి రంగంలోకి దిగిన ఆర్మీ.. దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడంతోపాటు ముగాబెను హౌజ్ అరెస్ట్చేసిన విషయం తెలిసిందే.అనంతర పరిస్థితుల్లో ముగాబేకు తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు దశాబ్ధాలు దేశాన్ని పాలించిన రాబర్ట్ ముగాబే రాజీనామా చేయడంతో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎమర్సన్ గతంలో ఉపాధ్యక్షుడిగా చేశారు.

No comments:
Write comments