బతుకమ్మ సంబరాలు నిర్వాహణ పై సమీక్షా సమావేశం

 

హైదరాబాద్, సెప్టెంబర్ 18  (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ నిర్వాహణ పై రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ను ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. 
బతుకమ్మ సంబరాలు నిర్వాహణ పై సమీక్షా సమావేశం

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో  బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను  ఆదేశించారు.బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరపాలని మంత్రి అధికారులను కోరారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, టూరిజం కమిషనర్. సునీతా భగవత్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఏండి మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ అధికారులు మహేష్, S ఈ. అశోక్ లు పాల్గొన్నారు.

No comments:
Write comments