భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తం

 

హైదరాబాద్, సెప్టెంబర్ 25, (globelmedianews.com)
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించండంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, అసోం, ఒడిశా, మేఘాలయ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.జార్ఖండ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు. 
భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తం

ఈ నేపథ్యంలో, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి..మరోవైపు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయింది. వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. ముందుకు వెళ్లలేక..వెనక్కి వెళ్లలేక నరకయాతన పడ్డారు. ఆరుగంటలకు పైగానే వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయయాయి.వాహనాలు మొరాయించడం, భారీగా నీరు ఉండడంతో ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సుల్లో వెళ్లే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. రోడ్లపై ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయి.. ఇంటికి వెళ్లే దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలో వున్నా, ట్రాఫిక్ జాములు తప్పలేదు.

No comments:
Write comments