గ్రామాల్లో యదేఛ్చగా నిషేధ మందుల విక్రయాలు

 

నిజామాబాద్, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం గోళి.. తలనొప్పి గోళి.. కడుపు నొప్పి గోళి... ఆయాసం గోళి.. ఇలా రోగం పేరు చెప్పి మందులు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధరైజ్డ్ షాపులు లేకపోవడంతో కిరాణా షాపులు, బడ్డీ దుకాణాలు వీటి అమ్మకాలకు అడ్డాగా మారాయి. ఏజెన్సీలే నేరుగా గ్రామాలకు వెళ్లి విక్రయిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలవారు మండల కేంద్రాలకు వచ్చినప్పుడు తీసుకెళ్తున్నారు. కొన్ని రకాల షుగర్‌ మాత్రలు, నొప్పులు, ఆయాసం, జ్వరం తగ్గేందుకు వాడే 329 రకాల మందులుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటి వల్ల దుష్ఫలితాలే అధికంగా ఉంటున్నాయని కేంద్ర డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక అందజేసింది. 
 గ్రామాల్లో యదేఛ్చగా నిషేధ మందుల విక్రయాలు

దీంతో వీటి తయారీ, పంపిణీ, అమ్మకాలపై పూర్తిస్థాయి  నిషేధం విధిస్తూ.. కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించింది. మందుల తయారీ, వాటి ఫలితాలు విశ్లేషించి విపణిలోకి విడుదల చేసేందుకు కేంద్రం, రాష్ట్రంలో వేరువేరుగా నియంత్రణ సంస్థలున్నాయి. దేశంలోకి ఏదైనా ఒక కొత్త ఔషధం తీసుకురావాలంటే సెంట్రల్‌ డ్రగ్‌ లైసెన్సింగ్‌ ఆథారిటీ ధ్రువీకరణ తప్పనిసరి. ప్రయోగ పరీక్షలకు సంబంధించిన అన్ని పత్రాలను వారికి సమరిస్తేనే అనుమతి లభిస్తుంది. ఇలా అన్ని కంపెనీలు విడివిడిగా అనుమతి పొందుతాయి. తర్వాత రాష్ట్రస్థాయి కొచ్చేసరికి తయారీ సంస్థలు నిబంధనలను విస్మరిస్తున్నాయి. కేంద్రంలో వేరువేరుగా అనుమతి పొందిన రెండు లేదా మూడు రకాల ఔషధాలను కాంబినేషన్‌లో రూపొందించి కొత్త గోళీలను తయారు చేస్తున్నాయి. అంటే నొప్పి, జ్వరం, జలుబు రోగాలు తగ్గేందుకు అవసరమైన మూడు రకాలను ఔషధాలను మిశ్రమంగా చేసి కొత్త మందును తయారు చేస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో తిష్ఠ వేసిన అమ్మకాల జాడ్యంపై దృష్టి పెట్టే అవకాశమే లేదు. దీంతో నిషేధం అమలు జరిగేనా అన్న ప్రశ్న ఉత్పమన్నమతోంది. సమన్వయ లోపమే ఎఫ్‌డీసీ మందుల ద్వారా నష్టమే ఎక్కువగా జరుగుతుందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఒకే మాత్రలో రెండు, మూడు రోగాలకు సంబంధించిన యాంటీ బయొటిక్స్‌ ఉపయోగిస్తారు. వీటిలో కొన్ని రకాలు డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌తోనే వాడాలి. మరి కొన్నింటికి మినహాయింపు ఉంది. ఆ మినహాయింపును దుర్వినియోగం చేస్తూ అన్ని రకాల మందులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాటిని అదేపనిగా వినియోగిస్తే.. మానవ శరీరం వాటికి అలవాటు పడిపోతుంది. కొన్ని రోజులకు అంతకు మించిన డోసు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నేళ్లకు పూర్తిగా యాంటీ బయొటిక్స్‌కు స్పందించడమే మానేస్తుందని తద్వారా వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు ఆరోగ్యశాఖకు సమర్పించిన నివేదికలో పొందుపరిచింది. నిబంధనల ప్రకారం కొత్త మందును తయారు చేస్తే.. మళ్లీ పరిశోధనలు జరగాలి. ఫలితాలను కేంద్ర సంస్థకు సమర్పించాలి. దుష్ఫలితాలు లేవని తేలితేనే అనుమతి లభిస్తుంది. అందుకు విరుద్ధంగా లెసైన్సుదారులు రాష్ట్రస్థాయిలో అనుమతి పొంది విపణిలోకి పంపేస్తున్నారు. 329 రకాల ఔషధాలకు వివిధ రాష్ట్రాల సంస్థలు అనుమతులు ఇచ్చినవే. ఇదంతా కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయలోపం కారణంగానే జరిగినట్లు కేంద్రం గుర్తించింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం ఆదేశాల మేరకు అధీకృత సంస్థలు తయారీని నిలిపేసినా.. ఇప్పటికే మార్కెట్టులోకి వచ్చిన వాటిని నియంత్రించడం వారికి కత్తిమీద సాములా తయారైంది.ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1100 రిటైల్‌ మందుల షాపులు, 200 ఏజెన్సీలు ఔషధాలను విక్రయిస్తున్నాయి. అన్ని షాపుల్లోనూ నిషేధిత జాబితాలోని మందుల వినియోగమే అధికంగా ఉంటుంది. కంపెనీల విస్తృత ప్రచారంతో ఆ పేర్లన్నీ ప్రజల్లోకి వెళ్లాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లోని చదువుకున్న, వైద్యంపై కనీస అవగాహన ఉన్న ప్రజలు వాటి పేర్లు చెప్పి మరి కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సైతం వీటిని వాడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా ప్రతినెలా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం అధికారులే వెల్లడిస్తున్నారు. ఇంత భారీగా వ్యాపారం చేస్తుంటే ఉమ్మడి జిల్లాలో వీటి నియంత్రణ కేవలం ముగ్గురు అధికారులే పనిచేస్తున్నారు. దీంతో అన్నిషాపులకు కేవలం సమాచారం ఇచ్చి వదిలేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో వందల కొద్దీ షాపులను తనిఖీలు చేయడానికే నెలల సమయం పడుతుంది.

No comments:
Write comments