కేసీఆర్‌ ఖబర్దార్!.. మంద కృష్ణమాదిగ హెచ్చరిక

 

పరకాల సెప్టెంబర్ 20 (globelmedianews.com)
మాదిగల అంతు చూడాలని చూస్తే సీఎం కేసీఆర్‌ అంతు చూస్తామని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. పరకాల పట్టణంలోని అమరధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మొదటి దఫాలోనే కాకుండా రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు చోటు ఇవ్వకపోవడం చూస్తేంటే మాదిగల అణిచివేత కుట్ర స్పష్టం అవుతుందన్నారు. 
కేసీఆర్‌ ఖబర్దార్!.. మంద కృష్ణమాదిగ హెచ్చరిక

1 శాతం వెలమలకు 4 మంత్రి పదవులు, 4 శాతం ఉన్న రెడ్డిలకు 6 మంత్రి పదవులు, 12 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22న చేపట్టబోయే మహా దీక్షతో యావత్తు ప్రపంచానికి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిగ యువసేన రాష్ట్ర కన్వీనర్‌ పుట్ట భిక్షపతి మాదిగ, పరకాల అధికార ప్రతినిధి దుప్పటి మొగిళి, ఎంఎస్‌ఎఫ్‌ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కెర ముఖేష్‌ మాదిగ పాల్గొన్నారు.  

No comments:
Write comments