జలశక్తి (పశ్చిమగోదావరి)

 

ఏలూరూ, సెప్టెంబర్ 11 (globelmedianews.com): 
వాననీటిని భూగర్భంలోకి ఇంకించడంలో ఇంకుడు గుంతలదే ప్రధాన భూమిక. అందుకే జలశక్తి అభియాన్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రాధాన్యంఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్‌కు జిల్లాలో జంగారెడ్డిగూడెం, పెదవేగి మండలాలు ఎంపికయ్యాయి. ఈ రెండు మండలాల్లో బోరుబావుల ద్వారా నీటి వినియోగంఅత్యధికంగా ఉండటంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఈ లోటును భర్తీ చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా రూ.3.67 కోట్లతో 5 వేల ఇంకుడుగుంతలు తవ్వనున్నారు.జలశక్తి అభియాన్‌ పథకం ఈ నెల 15తో ముగియనుంది.
జలశక్తి (పశ్చిమగోదావరి)

గడువులోగా ఈ రెండు మండలాల్లోని 50 పంచాయతీల్లో ప్రతి గ్రామానికి కనీసం వంద చొప్పున 5 వేల ఇంకుడుగుంతలు తవ్వాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యం. గ్రామాల్లో తగిన ఖాళీ స్థలం ఉండి వాననీరు, వాడకం నీరు చేరే అవకాశం ఉన్న గృహాలను ఈ పథకానికి ఎంపిక చేస్తారు. దీనికోసం అధికారులు భారీకసరత్తు చేపట్టారు. సమయం తక్కువగా ఉన్నందున యుద్ధప్రాతిపదికన ముందుకెళ్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రత్యేక తరహాలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్‌కురూ.7,350 చొప్పున వ్యయం చేయనున్నారు. దీనిలో నిర్మాణ సామగ్రికి రూ.6,158, కూలీలకు రూ.1,192 చొప్పున ఖర్చు చేస్తారు. ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించిననమూనాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం ఇంకుడు గుంతలను 1.8 మీటర్ల లోతు, 1.2 మీటర్ల చుట్టు కొలతతో చదరంగా తవ్వుతారు. గొయ్యి లోపలిభాగంలో అంచు చుట్టూ ఇనుప మెష్‌ అమరుస్తారు. గుంత అడుగు భాగంలో 40 ఎంఎం కంకర పరుస్తారు. దానిపైన 20 ఎంఎం మెటల్‌, తరువాత 12 ఎంఎం కంకర వేస్తారు. ఈ మూడు పొరలుకలిపి మొత్తం క్యూబిక్‌ మీటరు ఉంటుంది. దీనిపైన 600 ఎంఎం వ్యాసం గల సిమెంటు వరలు అమరుస్తారు. ఈ వరల్లోకి వర్షం నీరు, వాడకం నీరు వచ్చేలా పైపులైను వేస్తారు. సిమెంట్‌ వరలుమిగిలిన భాగాన్ని ఇసుకతో నింపుతారు. చివరిగా సిమెంటు పలకలు వేసి, చుట్టూ ప్లాట్‌ఫాం నిర్మిస్తారు.

No comments:
Write comments