గద్వాల రోడ్డులో వరి నాట్లు

 

జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 05(globelmedianews.com)
గురువారం నాడు గద్వాల రోడ్లను, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ను  మాజీ మంత్రి డీకే అరుణ సందర్శించారు. గద్వాల పంచాయితీ రాజ్ ఆఫీస్ ముందు రోడ్లు దుస్థితి ని చూసిన ఆమె అధికారులపై మండిపగ్గారు.గుంతల మయంగా మారిన రోడ్లపై డీకే అరుణ, బీజేపీ నాయకులు వరి నాట్లు వేసి నిరసనను వ్యక్తం చేసారు. 
గద్వాల రోడ్డులో వరి నాట్లు

అరుణ మాట్లాడుతూ గద్వాల అభివృద్ధి పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంచేతగాని తనం వలన అభివృద్ధి కి నోచుకోవడం లేదు. రోడ్లను మరమ్మతు చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని విమర్శించారు. గద్వాల రోడ్లు గుంతలమయం అయ్యాయి. సర్వీస్ రోడ్డువెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

No comments:
Write comments