రైతుల విషయంలో రాజీ లేదు

 

మంత్రి నిరంజన్ రెడ్డి
కరీంనగర్ సెప్టెంబర్ 11,(globelmedianews.com):
రైతుల విషయంలో రాజీ లేదు. ఒక్క వ్యవసాయ శాఖకే రూ.27 వేల కోట్లు కేటాయించాం.  రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత కరంటు సరఫరాకు బడ్జెట్ లో భారీగా నిధులుఇచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్ లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధికారులతో సమీక్ష మంత్రినిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్,  కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు, డీఎఓలు, ఏడీఎలు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్  రైతులకు సంబంధించిన విషయంలో ఎక్కడా వెనకడుకు వేయడం లేదు. 
రైతుల విషయంలో రాజీ లేదు

సాగునీటి రాకతో రాష్ట్రమంతటా  సాగు పెరిగింది. అధికారులు అంచనాలు పంపేముందు క్షేత్రస్థాయిలో సాగు వివరాలుతీసుకుని నివేదిక పంపండని సూచించారు.  యూరియా ఉన్నప్పటికి అవగాహన లేని కారణంగా తప్పుడు ప్రచారం జరిగింది. గతంలో పాస్ బుక్ లు చూయించి రైతులు యూరియా తీసుకెళ్లేవారు.  ఇప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశానుసారం ఆధార్ కార్డుతో పాటు వేలిముద్ర నమోదు చేయవలసి రావడంతో ఆలస్యం జరుగుతుందని అన్నారు.  ఈ వివరాలు అప్ లోడ్ అయితేనే గానీ యూరియాకంపెనీలు, ఏజెన్సీలకు సబ్సిడీ అందకపోవడం ఆ కంపెనీలు స్టాక్ పెట్టుకోవడానికి  ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ప్రస్తుతం అంతటా అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయి.  యూరియాఅందుబాటులో ఉన్న విషయం రైతు సమన్వయ సమితి, సహకార సంఘాలు , వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందించండి .. సమన్వయం చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్ ను ఆదేశించారు.

No comments:
Write comments