హాట్ హాట్ గా మంచు లక్ష్మీ

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 19  (globelmedianews.com)
గతంలో అనేక టాక్ షోస్‌తో ప్రేక్షకులను పలకరించిన మంచు లక్ష్మి ఇప్పుడు కూడా ఒక సరికొత్త టాక్ షో తో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ సారి ఇది టీవీ షో కాదు, వూట్  అనే యాప్ కోసం రూపొందించిన షో. గతంలో మంచు లక్ష్మి ప్రొడ్యూస్ చేసిన షోస్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. చిన్నప్పటి నుండి సినిమా ఇండస్ట్రీని, ఆ మనుషులను చూస్తూ పెరిగింది కాబట్టి వాళ్ళ పెర్సనల్ లైఫ్‌ని కూడా టచ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి ఆ సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పడంతో ఆ షో లు ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. ఆ తరువాత పేదవాళ్ళకు సాయం చెయ్యడానికి ఆమె హోస్ట్ చేసిన 'మేముసైతం' షో కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
హాట్ హాట్ గా మంచు లక్ష్మీ

ఈ షోలన్నీ ఒకెత్తు ఇప్పుడు ఆమె చెయ్యబోతున్న ఈ రీసెంట్ షో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్‌గా మాత్రమే ఉండదు ఎక్సయిటింగ్‌గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ షో లో ఫార్మల్‌గా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం లాంటి వ్యవహారాలు ఉండవు. చాలా క్యాజువల్‌గా ఉంటుంది. ఒక మంచం మీద ఇష్టం వచ్చినట్టు కూర్చుని, పడుకుని కూడా మాట్లాడుకుంటారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, హీరోలు వచ్చినా కూడా ఇలానే ఉంటుంది ఈ షో ఫార్మాట్. ఈ షో లో అందరికి తెలిసిన జనరల్ ప్రశ్నలు ఏమీ ఉండవు. ఎవ్వరికి తెలియని నాటీ సీక్రెట్స్ మాట్లాడుకుంటారు. ఈ షో కి ఇప్పటివరకు సమంత,కాజల్,రకుల్,వరుణ్ తేజ్ వచ్చారు. అయితే వాళ్ళను లక్ష్మి అడిగిన ప్రశ్నలు మామూలుగా లేవు.ఉదాహరణకి సమంతని లక్ష్మి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా?....''కాలేసుకుని పడుకోవడం ఇష్టమా నీకు?, లేక సెపరేట్ సెపరేట్‌గా పడుకుంటారా?''. ఈ ఒక్క ప్రశ్నని బట్టి ఆ షో ఎంత హాట్‌గా, ఎంత స్పైసీగా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. మీ ఫస్ట్ కిస్ అండ్ క్రష్...అన్నీ ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. వాటికి చాలా బోల్డ్‌గా సమాధానాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇది స్ట్రీమ్ అయ్యేది యాప్‌లో కాబట్టి సెన్సార్ అక్కర్లేదు, ఇంత టైమ్ అని లిమిట్ పెట్టుకోవక్కర్లేదు. అందుకే లక్ష్మి కూడా ఈసారి అన్ లిమిటెడ్ (అడల్ట్) ఫన్‌ని అదించబోతుంది. 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ షో ఈ నెల 23 నుండి వూట్  యాప్‌లో అందుబాటులోకి రాబోతుంది.ఈసారి టీజర్‌లో ఉన్న సెలబ్రిటీలంతా కూడా కాస్త పెద్దవాళ్ళు కావడం, ఫస్ట్ టైమ్ వాళ్ళ బోల్డ్ సీక్రెట్స్ అండ్ బెడ్ రూమ్ సీక్రెట్స్ రివీల్ చెయ్యబోతుండడంతో ఈ షో సూపర్ గా క్లిక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ తరహా కంటెంట్‌కి రిటార్డ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా అంతగా ఓపెన్ అప్ అయ్యే సెలబ్రిటీలు ఎంతమంది ఉంటారు అనేది కూడా చూడాలి. మొత్తానికి డిసిప్లైన్‌కి మారుపేరు అయిన మంచువారి అమ్మాయి ధైర్యం గా ఒక అడుగు ముందుకు వేసింది.ఆ షో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

No comments:
Write comments