నన్నపనేని రాజకుమారి ఆరెస్టు

 

విజయవాడ, సెప్టెంబర్ 11 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఆమెను అడ్డుకున్నపోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
నన్నపనేని రాజకుమారి ఆరెస్టు

తనపై నన్నపనేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్సై అనూరాధ ఆరోపించారు. మహిళా కమిషన్ కుచైర్ పర్సన్ గా వ్యవహరించిన నన్నపనేని బాధ్యతారహితంగా మాట్లాడారని విమర్శించారు. ఇంతలో అక్కడున్న టీడీపీ నేతలు, ఇతర పోలీసులు కల్పించుకోవడంతో ఆమె అక్కడి నుంచివెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఇతర మహిళా నేతలు ఉన్నారు.

No comments:
Write comments