అపరిశుభ్రతతో అవస్థలు

 

విశాఖపట్టణం, సెప్టెంబర్ 10, (globelmedianews.com)
విద్యాసంస్థల చెంత పేరుకుపోయిన అపారిశుధ్యంతో విద్యార్థులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆయా సంస్థల్లో వండి, వడ్డిస్తున్న భోజన పదార్థాలు బాగోలేకనో, మరే కారణాలతోగానీ వాటిని తినకుండా విద్యార్థులు పారబోస్తున్నారు. అవికాస్తా ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుళ్లి, అపారిశుధ్యంతోపాటు దుర్గంధాన్ని వెదజల్లుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా పట్టించుకునే దిక్కులేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అరకు లోయ డిగ్రీ కళాశాల, ఐటిఐ, దండకారణ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహాల్లో సక్రమంగా మెనూ అమలు కావడం లేదు. 
అపరిశుభ్రతతో అవస్థలు

మెనూ ప్రకారం భోజనాలు వడ్డించకపోవడం, పెట్టే భోజనం శుచి, రుచిగా ఉండకపోవడంతో విద్యార్థులు దాన్ని తినలేక వసతి గృహాల సమీపంలో పారబోస్తున్నారు. దీంతో అపారిశుధ్యం నెలకొంటోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ భోజన వ్యర్థాలన్నీ కుళ్లి, మరింత దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా దోమలు, ఈగలు వృద్ధి చెంది, రోగాలు విజృంభించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .వసతి గృహాలను శుభ్రంగా ఉంచాల్సిన నిర్వాహకులు సైతం దీన్ని పట్టించుకోకపోవడం విచారకరం. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా భోజనాన్నివండి పెడుతున్నారు. విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం భోజనం రుచిగా వండి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులుకోరుతున్నారు.

No comments:
Write comments