హరిత హారం...మేకల నోళ్లు కట్టేశారోచ్

 

కరీంనగర్, సెప్టెంబర్ 14, (globelmedianews.com)
హరితహారం మొక్కలను మేకలు తింటున్నాయని వాటిని బంధించి.. యజమానులకు జరిమానాలు వేస్తున్నారు అధికారులు, పోలీసులు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటన జరిగాయి.దీంతో.. అధికారులు హరితహారం మొక్కలు కాపాడుకునేందుకు కఠినంగా ఉంటూ.. మేకలు, పశువుల యజమానులకు భారీ జరిమామాలు విధిస్తున్నారు. మాట వింటే అవి మేకలెందుకుఅవుతాయి… 
హరిత హారం...మేకల నోళ్లు కట్టేశారోచ్

అందుకే.. వాటి మూతులు కట్టేశారు వాటి యజమానులు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారంమొక్కలను మేస్తున్నాయనే కారణంతో.. మేకల నోళ్లకు మూత వేశాడు ఐలయ్య అనే మేకల కాపరి. వాటర్, కూల్ డ్రింక్ బాటిళ్లను కట్ చేసి.. వాటిని దారాల సాయంతో.. మేకల మూతులకు కట్టారు.కొట్టంలో కట్టేసినప్పుడు.. ఊరికి దూరంగా తీసుకెళ్లినప్పుడు మాత్రమే మేకల నోళ్లను ఫ్రీగా వదిలేస్తున్నారు. వచ్చీపోయే దారిలో.. వాటి నోళ్లు ఇలా కట్టేస్తున్నారు యజమానులు.హరితహారం మొక్కలరక్షణ పేరుతో మూగజీవాలను ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు జంతు ప్రేమికులు. మొక్కలు కాపాడుకునేందుకు ప్రభుత్వం నాణ్యమైన కంచెలు ఏర్పాటుచెయ్యాలని కోరుతున్నారు. అధికారులుమేకల యజమానులపై ఒత్తిడి చేస్తే.. వాళ్లు ఇలా మేకలను ఇబ్బంది పెట్టాల్సి వస్తోందంటున్నారు.

No comments:
Write comments