వణకు పుట్టిస్తున్న నవీన్ పట్నాయక్

 

భువనేశ్వర్, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
మెతక మనిషి…. ఓర్పు గల నాయకుడు… సంయమనంతో వ్యవహరిస్తారు. ఇదీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి బాగా తెలిసిన వారు అనుకునే మాట. ఆయన ఇప్పటికి ఐదుసార్లు వరసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఐదుసార్లు నుంచి వరసగా గెలుస్తున్నా ఆయనలో ఏమాత్ర అహం కనపడదు. ప్రజా సమస్యల పరిష్కారం వైపే ఆయన చూపుంటుంది. పాలన సజావుగా జరగాలన్నదే ఆయన లక్ష్యం.ఎన్నికల సమయంలోనూ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళతారు. ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువని అంటారు. ప్రచారం కోసం నవీన్ పట్నాయక్ ఏనాడు పరితపించారు. తన పాలన, ముందుచూపుతో వెళుతుండటం కారణంగానే రాష్ట్రంలో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఎదిగే అవకాశం ఇవ్వలేదు నవీన్ పట్నాయక్. 
వణకు పుట్టిస్తున్న నవీన్ పట్నాయక్

ప్రజలు అంతగా ఆదరిస్తున్న ఆయన ఐదోసారి ముఖ్యమంత్రి అయినా తర్వాత పూర్తిగా అవినీతి నిర్మూలనపైనే దృష్టి పెట్టారు.తన పరిపాలనలో అవినీతికి తావుండకూడదని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. అధికారుల సమావేశాల్లో గాని, బహిరంగ సభల్లో కాని అవినీతి జరిగితే నేరుగా తనకు ఫోన్ చేయాలని కూడా నవీన్ పట్నాయక్ ప్రజలకు పిలుపు నిచ్చారు. గతంలో అవినీతికి పాల్పడిన మంత్రుల విషయంలో కూడా నవీన్ పట్నాయక్ ఏమాత్రం జాలి చూపలేదు. మంత్రులను వెంటనే తన మంత్రివర్గం నుంచి తొలగించారు. దీనివల్ల పార్టీలో అసంతృప్తి రేగినా ఆయన లెక్క చేయలేదు.తాజాగా ఆయన అధికారులను విధుల నుంచి తొలగించి సంచలనం సృష్టించారు. అవినీతి రహిత పాలన, ప్రభుత్వ పథకాలను వేగవంతంగా తీసుకెళ్లాలని ఆయన అధికారులకు ప్రతి సమావేశంలో చెబుతూ వచ్చారు. అయితే నిర్లక్ష్యం వహించిన, అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశారు. ఎంతగా అంటే నెల రోజుల్లో 37 మంది అధికారులను విధుల నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన వారిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నవీన్ నిర్ణయంతో అధికారుల్లో వణుకు ప్రారంభమయింది.

No comments:
Write comments