తగ్గుముఖం పట్టిన జ్వరాలు: మంత్రి ఈటల

 

హైదరాబాద్,  సెప్టెంబర్ 7  (globelmedianews.com)
వినాయక చవితి పండగ రోజునుండి ఇప్పటి వరకు వైరల్ జ్వరాలపై అనుక్షణం సమీక్ష నిర్వహిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 24 గంటలు మానిటర్ చేస్తున్నామనిఅన్నారు. జ్వరాలు వచ్చిన తరువాత వైద్య ఆరోగ్య శాఖ చికిత్స అందిస్తుంది. నివారణ కోసం జిహెచ్ఎంసి,మున్సిపల్,పంచాయతీరాజ్,ఎంటమాలజీ విభాగాలతో సమన్వయం  చేసుకొని దోమల, వైరల్జ్వ రాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతూ వచ్చే వారికోసం ప్రత్యేక వార్డు ను ప్రారంభించామనిమంత్రి తెలిపారు. మగవారికోసం20 బెడ్స్, ఆడవారికోసం 20 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. 
తగ్గుముఖం పట్టిన జ్వరాలు: మంత్రి ఈటల

జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితి తెలుసుకొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఏజెన్సీప్రాంత డాక్టర్స్ అందరు అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలనీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. 108,104 లు సక్రమంగా నడిచేలా చూడాలని కోరారు.జ్వరాల వల్ల సంభవించిన మరణాలపై ఆరా తీశారు. మందులు, మంచాలు,డాక్టర్స్ సరిపడా ఉన్నది లేనిది తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఒకే మంచంపై ముగ్గురు పేషెంట్స్ ఎందుకుఉంచారంటూ వివరణ కోరారు. హాస్పిటల్ బిల్డింగ్స్ సరిపడా లేకపోతే అవసరం అయిన చోట అద్దె కి తీసుకోవాలని సూచించారు. డాక్టర్స్ ని హేతుబద్దీకరణ  చేసుకొని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోడాక్టర్స్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఫీవర్ హాస్పిటల్ సందర్శించిన సందర్భాల్లో పరిశీలించిన సమస్యలపై చర్యలు తీసుకున్నామన్నారు. సిపిపి యూనిట్లు 3 అదనంగా ఏర్పాటు చేయడంద్వారా రోగులకు వేచి ఉండే సమయం తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. 70 బెడ్స్ కూడా అందించామని తెలిపారు. మందుల ఇచ్చే దగ్గర క్యూ లైన్లు లేకుండా కౌంటర్లు పెంచాలని ఫీవర్ హాస్పిటల్సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీచేశారు.హాస్పిటల్స్ సందర్శించిన సమయంలో చెప్పిన అంశాలను నమోదు చేసుకుని ఆ పనులు అవుతున్నాయో లేదో ప్రతి రోజు  నివేదిక అందించాలని వైద్యవిద్య సంచాలకులు రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి లను ఆదేశించారు.   రాష్ట్రంలో  తగ్గుముఖం పట్టిన జ్వరాలు. నిరంతర సమీక్షలు వివిధ డిపార్ట్మెంట్లఅప్రమత్తతో జ్వరాల తీవ్రత తగ్గిందని మంత్రి తెలిపారు.హాస్పిటల్స్ కి వచ్చే వారి సంఖ్య  తగ్గిందని అయన అన్నారు. వచ్చిన వారిలో కూడా డెంగీ  జ్వరంతో బాధపడే వారి సంఖ్య  ఇంకా తగ్గింది అనిఅందుకే ప్రజలు ఎంతమాత్రం భయపడవద్దని అన్నారు.

No comments:
Write comments