ఆర్హులందరికీ సన్న బియ్యం సరఫరా

 

గుడివాడ, సెప్టెంబరు 24  (globelmedianews.com)    
అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తామని జాయింట్ కలెక్టరు కె.మాధవీలత అన్నారు.   గుడివాడ పట్టణంలో పామర్రురోడ్డులో గల  కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న (సిడబ్ల్యూసీ) గోడౌన్ ను మంగళవారం జాయింట్ కలెక్టరు మాధవీలత జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ రాజ్యలక్ష్మి, ఆర్డీవోసత్యవాణితో కలసి సంధర్శించి, గోడౌన్ లో వున్న బియ్యం నిల్వలను పరిశీలించారు. 
 ఆర్హులందరికీ సన్న బియ్యం సరఫరా

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైనసన్నబియ్యాన్ని చౌకధరల దుకాణాల సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు సంబందించి జిల్లాలోని అన్ని గోడౌన్లలో ఎంతెంత స్టాకు ఉన్నదిపరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ పరిశీలనలో బియ్యం నమూనాలను సేకరించి బ్రోకేన్ రైస్, డిస్క్ కలరేషన్ వివరాలను సివిల్ సప్లై కమీషనరు వారికి, సివిల్ సప్లై మంత్రి వర్యులకు నివేదించడంజరుగుతుదన్నారు. తదుపరి రాష్ట్ర స్థాయిలో వారు నిర్ణయం తీసుకుంటారన్నారు. నాణ్యమైన బియ్యాన్ని పరిశీలించేందుకు జాయింట్ కలెక్టరు అధ్యక్షతన  జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసామన్నారు.ఈ కమీటీలో పౌరసరఫరాల శాఖ అధికారులు, సాంకేతిక నిఫుణులు ఉంటారని, వీరితోపాటు రైస్ మిల్లర్సు అసోషియేన్ సభ్యులు ఉంటారన్నారు. ఈ కమిటీ సభ్యులు రైస్ మిల్లర్ల సమక్షంలో బియ్యంశాంపిల్స్ ను సేకరించి వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు.   పర్యటనలో జాయింట్ కలెక్టరు వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ రాజ్యలక్ష్మి, ఆర్డీవో, సత్యవాణి సివిల్ సప్లై అధికారులు,సిబ్బంది వున్నారు.

No comments:
Write comments