మూసిలో వరద నీరు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 28, (globelmedianews.com)
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి 10 గంటల తరువాత ప్రారంభమైన వర్షం ఏకధాటిగా సుమారు నాలుగు గంటలపాటు కురవడంతో హైదరాబాద్చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఏకంగా సుమారు 15.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, రంగారెడ్డి (రాజేంద్రనగర్)లో 14సె.మీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరిలో 10.4 సె.మీటర్లు వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వరుసగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్,ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండను తలపిస్తున్నాయి. 
మూసిలో వరద నీరు

హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టిఎల్ 513 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 513.7 మీటర్లుగానమోదయ్యింది.అదనంగా ఉన్న నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1762.6 అడుగుల నీళ్లు వచ్చిచేరాయి. హిమాయత్‌సాగర్ ఎఫ్‌టిఎల్ 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1740.6 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. ఇప్పటికే వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ తదితరప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిస్తే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 2000ల సంవత్సరంలో హుస్సేన్‌సాగర్ నిండగా ప్రస్తుతం ఈ సారికురిసిన వర్షాలకు మరోసారి నిండింది. దీంతో దిగువ ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు  తెలిపారు. కోస్తాంధ్ర, యానాంలో రాగల మూడురోజులు తేలికపాటి జల్లులుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు

No comments:
Write comments