పెన్నా నదికి నీరు విడుదల

 

కడప సెప్టెంబర్ 4 (globelmedianews.com)
కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలంలోని మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి గేట్లు ఎత్తి నీటిని  జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విడుదల చేసారు.  ప్రస్తుతం జలాశయంలోకి 2 టీఎంసీల నిల్వ చేరి ఉంది. ఈ రోజు గేట్లు ఎత్తి నీరు వదలడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జలాశయం నుండి రోజుకు 500 క్యూసెక్కులు ప్రవాహంతో నీరు విడుదల చేయునట్లు అధికారులు తెలిపారు. 
పెన్నా నదికి నీరు విడుదల

ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మొదలై నూరు రోజులలోనే కృష్ణా నీరు పుష్కలంగా మైలవరం జలాశయానికి రావడం జరిగిందన్నారు. పెన్నా నదికి నీటిని విడుదల చేయడం వల్ల జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తూ ప్రజలకు సద్వినియోగం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం వల్లే ఈ నీరు వచ్చిందని రైతులు ఆనందంగా ఉన్న రోజే సకాలంలో వర్షాలు పడి నీరు పుష్కలంగా ఉంటుందని తెలిపారు.

No comments:
Write comments