వాల్యుయేషన్ లో అనుమానాలు

 

విజయవాడ, సెప్టెంబర్ 21  (globelmedianews.com)
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే ఆరోపణలతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న అభ్యర్థుల్లో మూల్యాంకంలోనూ తేడాలున్నాయన్న భావనకలుగుతోంది. ఆన్సర్ కీ ప్రకారం అంచనా వేసుకున్న మార్కులకు, తమకు వచ్చిన మార్కులకు ఏ మాత్రం పొంత లేదని.. మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉందని వాపోతున్నారు.విజయనగరం జిల్లాకుచెందిన ఓ అభ్యర్థి కేటగిరీ-1 పరీక్ష రాయగా.. తుది ఆన్సర్ 'కీ' ప్రకారం నెగెటివ్ మార్కులు మినహాయించగా 66.25 మార్కులు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం అతనికి షాక్ ఇచ్చారు.
వాల్యుయేషన్ లో అనుమానాలు

సెప్టెంబరు 19న విడుదల చేసిన ఫలితాల్లో ఆ అభ్యర్థికి కేవలం 11.5 మార్కులే వచ్చాయి.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో అభ్యర్థికి 'కీ' ప్రకారం 54.2 మార్కులు రావాల్సి ఉండగా.. కేవలం7.5 మార్కులే వచ్చాయి. వీరే కాక ఇలా ఎంతో మంది అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే మార్కుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌‌లో సూచించిననెంబర్లలో సంప్రదించి, ఫిర్యాదు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అభ్యర్థులకు సూచించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సమాధాన పత్రం మూల్యాంక విషయంలో అన్ని జాగ్రత్తలుతీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నెగెటివ్ మార్కుల కారణంగా.. అభ్యర్థులు తమకు వస్తాయనుకున్న మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. అప్పటికీతక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు భావిస్తే.. రీవెరిఫికేషన్ చేస్తామని విజయ్ కుమార్ తెలిపారు.

No comments:
Write comments