దొరకని ఆచూకీ.... ఇంకా ఎదురుచూపు

 

రాజమహేంద్రవరం  సెప్టెంబర్ 23, (globelmedianews.com)
కచ్చులూరు బోటు బోల్తా ఘటన జరిగి వారం రోజులైంది. ఈసంఘటనలో 51మంది గల్లంతు కాగా, ఇప్పటికి37 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారం రోజులుగా గల్లంతైన వారి ఆచూకీ కోసం మంచిర్యాలకు చెందిన కారుకూరి సుదర్శన్, హైదరాబాద్కు చెందిన రాజేంద్రప్రసాద్, కాకినాడకు చెందిన బోటు డ్రైవర్ నూకరాజు కుటుంబ సభ్యులు, వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కి ధర్మారావు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఒక మహిళ మృతదేహం సంఘటనా స్థలానికి కొంత దూరంలో గోదావరి నీటిపై తేలింది. ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటికీ 37 మృతదేహాలు లభ్యమయ్యాయి. 
దొరకని ఆచూకీ.... ఇంకా ఎదురుచూపు

ఇంకా 14మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు తెలిసింది. నీరసించిన ముఖాలతో, విచార వదనంతో ఆసుపత్రి వద్ద బంధువులు పడిగాపులు కాస్తున్నారు.పోలీసు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ డెస్క్ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న హెల్ప్ డెస్క్ వద్ద తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల కోసం బీమా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మీ ఉత్తర్వులతో పోలీసులు ఈకేంద్రంలో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను ఏర్పాటుచేసి ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇన్సూరెన్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలను నమోదు చేస్తుంది. దీనిని ఎస్బీ సీఐ రాంబాబు పర్యవేక్షిస్తున్నారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ జోనల్ డీజీఎం బీఎస్జీకే మోహన్, బీఎన్కే ప్రకాష్ కుమార్ లు ఇన్సూరెన్స్ డెస్క్ ను పర్యవేక్షిస్తున్నారు.

No comments:
Write comments