ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద

 

రాష్ట్ర  వైద్యా అరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
పెద్దపల్లి సెప్టెంబర్ 13 (globelmedianews.com)
ప్రజల ఆరోగ్యం  పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చుపెడుతుందని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్  తెలిపారు.   గోదారిఖని ఎరియా ఆసుపత్రి పరిధిలో  నూతనంగా ఎన్టిపిసి సీఎస్ఆర్నిధులతో   రూ.7.8  కోట్లతో నిర్మీస్తున్న 50 పడకల  ఆసుపత్రికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేసారు.   గోదావరిఖని ఎరియా ఆసుపత్రిలోని  డయాలసీస్ సెంటర్ ను మంత్రి సందర్శించి అక్కడఅందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ  రామగుండం శాసనసభ్యులు  కోరుకంటి చందర్ అధ్యక్షతన నిర్వహించిన  కార్యక్రమంలో  పాల్గోన్న మంత్రిమాట్లాడుతూ  గత   4 రోజులుగా తాను  సూర్యాపేట నుంచి ప్రారంభించి మొత్తం 13 జిల్లాల మేర పర్యటించానని, 
ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద

బయట ప్రచారంలో ఉన్న స్థాయిలో  ప్రజలు అనారోగ్య పాలు కావడం లేదని,  ప్రస్తుతం ఆసుపత్రులలో ఉన్న వారిలో చాలా మంది వాతావరణం మారడం వల్ల వచ్చే  సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారే 99%  ఉన్నారని మంత్రి తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నసౌకర్యాలను వినియోగించుకుంటూ   రాష్ట్రంలోని వైద్య సిబ్బంది, వైద్యులు సెలవులు సైతం తీసుకొకుండా ప్రతి రోజు ఒపిల సంఖ్య పెంచి , ప్రజలకు సేవలను అందిస్తున్నారని మంత్రి అన్నారు.  రాష్ట్రప్రభుత్వం  ప్రజల ఆరోగ్యం విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలకు అవసరమైన మందులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రులలోఅందుబాటులొ ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.  తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వమని, ఆ దిశగా కేసీఆర్ కిట్ వంటి పథకాన్నీప్రారంభించామని, ఆసరా పెన్షన్లను ఒంటరి మహిళలకు, బోధకాల వ్యాధిగ్రస్తులకు సైతం అందించామని మంత్రి తెలిపారు.  తాను గోదావరిఖని ఎరియా ఆసుపత్రిలోని   డయాలసీస్ చేసుకుంటున్నవారు చాలా మంది  మగవారు, ఇంటి పెద్దలు ఉన్నారని,  వీరికి పెన్షన్ అందించాలనేది  సానుకూలదృక్పథంతో చుడాల్సిన అంశం అని  , దీని పై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయంవెలువడేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి పేర్కోన్నారు.  ఉమ్మడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో  తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఉద్యమం ప్రారంభం కాకముందు ఒక మెడికల్ కాలేజీ సైతంప్రారంభించలేదని, ఉద్యమం డిమాండ్ చేస్తే  నిజామాబాద్ లో  వైద్యశాలను ప్రారంభించారని తెలిపారు.  రాష్ట్ర ఎర్పడిన 5 సంవత్సరాలలో  సిద్దిపేట, మహబుబ్ నగర్, నల్గోండ తదితర ప్రాంతాలో 4  ప్రభుత్వం  వైద్య కళాశాలలను ప్రారంభించామని  మంత్రి గుర్తు  చేసారు,   ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామి మేరుకు త్వరలో  రామగుండంలో  సైతం ప్రభుత్వ  కళాశాలఏర్పాటు చేసే దిశగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేసారు.

No comments:
Write comments