రైతుల కోసమే మా ప్రభుత్వం

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (globelmedianews.com)
రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో వ్యవసాయ శాఖ బలోపేతానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానమిస్తూ..సాగుకు యోగ్యమైన ప్రతి 5 వేల ఎకరాలకు ఓ వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించినట్లు తెలిపారు. 
 రైతుల కోసమే మా ప్రభుత్వం

అధికారులకు వ్యవసాయానికి సంబంధించిన నూతన టెక్నాలజీని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యవసాయ విద్యను పెంచడం కోసం 4నూతన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ కార్యాలయాల్లోమౌళిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు.

No comments:
Write comments