బాధ్యతను మరిచి ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రులు

 

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌
హైదరాబాద్‌ సెప్టెంబర్ 24 (globelmedianews.com)    
తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులు బాధ్యతను మరిచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కర్నెప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడేమో తెలంగాణ పథకాలు బాగున్నాయని ప్రశంసిస్తారు.. కాషాయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడేమో ప్రభుత్వాన్నివిమర్శలు చేస్తున్నారు. అది మంచిది కాదని కేంద్ర మంత్రులకు ప్రభాకర్‌ సూచించారు.
బాధ్యతను మరిచి ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రులు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా రాష్ర్టాల్లో అమలు చేసేఅవకాశం ఉందా? అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించారు. మీ సొంత రాష్ట్రమైనా ఒడిశాలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసే దిక్కు మీకు లేదు.తెలంగాణకు వచ్చేసి ప్రజల దీవెనలున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడిపోతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణ కంటే గొప్ప పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.మీరు గొప్పగా అమలు చేస్తున్న పథకాలు ఏవో చెప్పి విమర్శిస్తే అర్థముంటది. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోంది. తెలంగాణ పథకాలనే కేంద్రంతో సహా పలు రాష్ర్టాలు అమలుచేస్తున్నాయి. కేంద్రం చేయలేని పనులను తెలంగాణ చేస్తోంది. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు.. తెలంగాణ పథకాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. బీజేపీ నేతలు ద్వంద విధానంప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారు అని కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు.

No comments:
Write comments