భూ సమస్యల పరిష్కారానికి కృషి

 

ఒంగోలు, సెప్టెంబర్ 11,(globelmedianews.com):
జిల్లాలో  భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ,  పోలీస్  శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పోల భస్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రకాశం  భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో కందుకూరు  రెవిన్యూ డివిజన్ అధికారుల  సమావేశం  జిల్లా  కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని భూసమస్యల కారణంగా గ్రామాలలో ప్రజల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. జిల్లాలో రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ప్రణాళికా బద్దంగా వ్యవహారించి  భూసంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో పోలీస్ శాఖ నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి  భూ సమస్యలపై వచ్చే అర్జీలకుఅత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.  
భూ సమస్యల  పరిష్కారానికి కృషి

తహశిల్ధార్లు, సబ్ ఇన్ స్పక్టర్లు గ్రామాలలో పర్యటించి సమస్యలు  పరిశీలించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఉగాది నాటికి అర్హులైన ప్రజలందరికి  నివేశ స్థల  పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రజా సాధికారికక  సర్వే ద్వారా గృహ నిర్మాణ శాఖఅధికారులు 2.20 లక్షల మందికి నివేశ  స్ధల  పట్టాలు కావలసిందిగా సర్వేలో  తెలియజేశారన్నారు. వారిలో 30 వేల మందికి నివేశ స్ధల పట్టాలు కావాలని తెలియజేశారు. ప్రస్తుతం గ్రామ వాలంటీర్లుసర్వే ప్రకారం 2.24 లక్షల మందికి ఇంటి నివేశ స్ధలాలు అవసరమని తెలియజేశారని ఆయన అన్నారు.  గ్రామాలలో గ్రామ రెవిన్యూ అధికారులతో సర్వే నిర్వహించి అర్హత గల లభ్ధీదారుల జాబితాలుతయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి నివేశ స్ధలాలు ఇవ్వాలన్నారు. అర్హుత లేని వారికి ఎట్టి పరిస్థితులలోను నివేశ స్థల పట్టాలు ఇవ్వకూడదన్నారు.  గృహనిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించి నివేదికలను ఈ  నెలాఖరులో ఇవ్వాలని ఆయన అన్నారు.  ప్రభుత్వ భూములు లేని  చోట పట్టా భూములను భూ సేకరణ ద్వారాసేకరించడానికి ప్రతిపాదనలు తయారు  చేయవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.జిల్లాలో స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా చదివి, అర్ధం చేసుకోని ప్రజలసమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికరులను ఆదేశించారు. మీ సేవకేంద్రాలలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగ పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తహశిల్ధార్లు కంప్యూటర్ అడంగళ్ మీద దృష్టి పెట్టాలనిఆయన అన్నారు. లింగ సముద్రం మండలంలో భూ సమస్యలు అధికంగా వున్నాయని వచ్చే శుక్రవారం  లింగసముద్రం మండలంలో గ్రామ సభలు నిర్వహించి  భూ సమస్యలు పరిష్కరించడానికిచర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ ఎస్.షన్ మోహన్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, కందుకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఓబులేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,కందుకూరు రెవిన్యూ డివిజన్ తహశిల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments