ఘనంగా బతుకమ్మ సంబరాలు

 

వరంగల్, సెప్టెంబర్ 26, (globelmedianews.com)
వరంంగల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన బతుకమ్మ పాటలు పాడుతూ, చిందులేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకునిచ్చే బతుకమ్మ మన రాష్ట్ర సాంప్రదాయ పండుగ. 
ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఏడాదికోసారి మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మన అదృష్టమని మంత్రి అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లోనూ అందరూ పాల్గొని, పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. సాంప్రదాయ పండగలను మర్చిపోకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారుఅనంతరం మంత్రి జిల్లా కేంద్రంలోని బాలుర డిగ్రీ కళాశాలలో అదనపు గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానంతరం, మంత్రి వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళా ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Write comments