నిమజ్జనంలో అపశృతి..ఆరుగురు చిన్నారుల మృతి

 

బెంగళూరు  సెప్టెంబర్ 11, (globelmedianews.com)
కర్నాటక రాష్ట్రంలో జరిగిన వినాయకుని నిమజ్జనం లో అపశృతి చోటుచేసుకుంది.. చిత్తూరు జిల్లా.. వి.కోట మండలం ఆంధ్ర..కర్ణాటక సరిహద్దులోని కోలార్ జిల్లా..క్యేసంబళ్ల సమీపంలోని మరదగట్టాగ్రామంలో విషాదం చోటుచేసుకుంది.. గణేష్ నిమజ్జనం కోసం సమీపంలోని ఓ నీటికుంట దగ్గరకు వినాయకుడిని తీసుకువెళ్లిన పిల్లలు సుమారు ఆరు మంది పిల్లలు కుంటలో పడి మృతి చెందారు..
నిమజ్జనంలో అపశృతి..ఆరుగురు చిన్నారుల మృతి

మొదట ముగ్గురు పిల్లలు కుంటలో పడిపోయారు. వారిని కాపాడుకునేందుకు ప్రయత్ననించిన  మరో ముగ్గురు పిల్లలుకుడా ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. దీన్ని గమనించిన గ్రామస్థులుచిన్నారులను బయటకు తీసారు. ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఆరు మంది పిల్లలుచనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

No comments:
Write comments