ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి

 

కౌతాళం సెప్టెంబర్ 19 (globelmedianews.com)
ప్లాస్టిక్ మహమ్మారి తరిమికొట్టాలని ప్రభుత్వ అధికారులు ఆశ వర్కర్లు మండల కేంద్రంలో గురువారం  భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఒక్కరు పాటించాలని స్వేచ్చత హి సేవ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్లాస్టిక్ నిషేధాన్ని అందరు సహకరించాలని  మండలకేంద్రం లో ప్రజలకు వివరిస్తూ వాటి వల్ల నష్టాలు తెలుపుతూ అధికారులు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్మికులు,పంచాయతీ కార్యాలయం నుండి బిస్మిల్లా సర్కిల్ మీదుగా పురవీధుల్లో ప్లాస్టిక్ నిషేధం నిషేధించాలని ప్రతి ఒక్కరు సహకరించాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. 
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి

అధికారులుమాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని దీనికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తమకు  సహకరించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ సహకరించి నప్పుడే  ప్రభుత్వానికి సాద్య పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు,గ్లాసులు,పర్యావరణాన్ని  నాశనం చేస్తుందని ప్లాస్టిక్ కవర్లు పశువులు తిని చనిపోతున్నాయి తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు

No comments:
Write comments