గ్రామాలలో శ్రమదానం చేయడానికి యువత ముందుకురావాలి

 

కలెక్టర్ నారాయణరెడ్డి
ములుగు సెప్టెంబర్ 10  (globelmedianews.com)
గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం అని   కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.       నూతన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలోని అన్ని పల్లెలలో గాంధీజీ కలలుగన్నగ్రామస్వరాజ్యం సిద్ధించాలన్నదే అదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ములుగు మండలంలోని జంగాల పల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక అమలుకార్యక్రమంలో భాగంగా అయిదవరోజు గ్రామస్తులు అందరి సమక్షంలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ ఎస్పీలు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. కలెక్టర్ ఎస్పీల రాక సందర్భంగా గ్రామస్తులంతాపండుగ వాతావరణం మధ్య కలెక్టర్ ఎస్పీలను ఆహ్వానించి ఊరేగింపుగా గ్రామానికి తోడ్కొని వెళ్లారు. గ్రామంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుని వద్ద కలెక్టర్ ఎస్పీ లచేప్రత్యేక పూజలు నిర్వహించారు.  
గ్రామాలలో శ్రమదానం చేయడానికి యువత ముందుకురావాలి

అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహింప చేశారు. అనంతరం ఆంధ్ర బ్యాంకు వద్ద ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలఅభివృద్ధి అయితేనే జిల్లాలు అభివృద్ధి అన్ని జిల్లాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు గ్రామాల్లో గ్రామస్వరాజ్యం జరగాలని ఉద్దేశంతోనే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు పెట్టిన పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుందని గ్రామస్తులంతా తు.చ.తప్పకుండా పనులు చెల్లించవలసిన అవసరం ఎంతోఉందన్నారు. గ్రామ పంచాయతీలు బలోపేతం కావడానికి దాతల ద్వారా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నారు. గ్రామాల్లో శ్రమదానం చేయడానికి యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. యువతకు శారీరక శ్రమ ఎంతో అవసరమని శారీరక శ్రమ తోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా రూపుదిద్దుకోవడం జరుగుతుందని అని గుర్తు చేశారు. గ్రామ పరిసరాలుబాగుంటేనే గ్రామం బాగుంటుందని గ్రామం బాగుంటేనే ప్రజలందరూ మనం బాగుందా మని అన్నారు గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాల ద్వారా తీసుకున్నరుణాలను వంద శాతం చెల్లించవలసిన అవసరం గ్రామస్తులపై ఉందన్నారు. వ్యవస్థను అందరి సహాయ సహకారాలతో బాగు చేసుకోవడం ఎంతో అవసరం అన్నారు. చేయి చేయి కలుపుతూముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ములుగు - వెలుగు కార్యక్రమంలో జంగాలపల్లి గ్రామాన్ని తాను స్వయంగా దత్తత తీసుకోవడం జరిగిందని గ్రామఅభివృద్ధికి 100% తన సహాయ సహకారాలు ఉంటాయని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. జంగాలపల్లి గ్రామాన్ని ములుగు జిల్లాకు రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యతగ్రామస్తులపై ఉందని గుర్తు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ప్రజల సొంత ఆస్తులు కలిగి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రానున్న వారం రోజుల్లో గ్రామం మొత్తంఎల్ఈడి బల్బులు అమర్చి అంతిమంగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టు షాపుల నిర్వహణ తో కుటుంబాలు ఆగమై పోతున్నాయని కలెక్టర్ ఎస్పీల దృష్టికి తీసుకురాగా స్పందించిన వారుగ్రామములో ఇకనుంచి బెల్టుషాపులు నిర్వహించకుండా గుడుంబా ను విక్రయించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు గ్రామస్తులకు హామీ ఇచ్చారు

No comments:
Write comments