ఆర్ధిక శాఖ పట్టాలెక్కేనా

 

హైద్రాబాద్ సెప్టెంబర్ 10 (globelmedianews.com)
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న హరీష్ రావుకు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో నెలకొన్న ఆర్థికమాంధ్యం పరిస్థితుల గురించి బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయినా రాష్ట్రాన్ని పురోగమన బాటలో నడిపిస్తున్నామని, సంక్షేమ పథకాలకు ఢోకా లేకుండా చూస్తున్నట్లుస్పష్టంచేశారు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావుకు కీలక ఆర్థిక శాఖను కేటాయించడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. 
ఆర్ధిక శాఖ పట్టాలెక్కేనా

హరీష్ రావుకు కీలకబాధ్యతలు అప్పగించడంతో ఆయన అభిమానులు కొందరు సంతృప్తి వ్యక్తంచేస్తుండగా..మరికొందరు మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఈ శాఖ బాధ్యతల నిర్వహణ హరీష్‌కు కత్తిమీదసామే అంటున్నారు.తెలంగాణ ఆర్థిక అవసరాలపై హరీష్ రావుకు సమగ్ర అవగాహన ఉందని, ఇది అక్కరకు వస్తుందన్న నమ్మకంతోనే ఆ శాఖ బాధ్యతలను ఆయనకు సీఎం కేసీఆర్ కట్టబెట్టారనిఅభిప్రాయపడుతున్నారు. మాంద్యం పరిస్థితులను అధిగమించి తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధిని సరైన నడపగల సామర్థ్యం హరీష్ రావుకు ఉన్నాయని చెబుతున్నారు. హరీష్ రావు శక్తి,సామర్థ్యాలపై నమ్మకంతోనే ఆయనపై సీఎం కేసీఆర్ పెద్ద భారాన్ని మోపారని అంటున్నారు హరీష్ రావు అభిమానుల్లో మరికొందరు మాత్రం హరీశ్ రావుకు ఆయన గతంలో నిర్వహించిననీటిపారుదల శాఖను కేటాయించి ఉంటే బాగుండేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడంతో హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపారని గుర్తు చేస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకుఆర్థిక శాఖ ఏ విధంగానూ దోహదపడే అవకాశమే లేదని చెబుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా గొప్పపేరు సాధించిన హరీశ్ రావుకు...ఆర్థిక శాఖ రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుందనిఅంటున్నారు. ప్రజా నాయకుడిగా హరీష్ రావు పేరు సాధించేందుకు ఆర్థిక శాఖ బాధ్యతలు అక్కరకు రాదని చెబుతున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతల కారణంగా హరీశ్ రావు ప్రజల మధ్య తిరగలేరని,ఆఫీస్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో క్రమంగా హరీశ్ రావు కార్యకర్తలకు దూరమయ్యే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చుని కొందరు సోషల్ మీడియా వేదికగాఅభిప్రాయపడులున్నారు. అయితే ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టినంత మాత్రానా కార్యకర్తలకు దూరమవుతారనుకోవడానికి లేదు అనేది మరో వాదన. ఆర్థికమంత్రిగా కొత్త సంస్కరణలు తీసుకురావడంద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరోసారి అందరి అభిమానాన్ని చూరగొనే అవకాశం ఉందంటున్నారు. పదవీ బాధ్యతలు చేపడుతూనే.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా హరీష్ రెండింటినిబ్యాలెన్స్ చేసుకోగలరని చెబుతున్నారు.

No comments:
Write comments