యురేనియం తవ్వకాలపై నిషేదం

 

తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, సెప్టెంబర్ 16, (globelmedianews.com);
తెలంగాణ అసెంబ్లీలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. తీర్మానాన్ని సభలో మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నల్లమల కేవలం అడవే కాదు... తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తిత్వం అని తెలిపారు. అడవి నుంచి పూచిక పుల్లను కూడా ముట్టనియ్యం. కేంద్రం బలవంతం చేస్తే పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.కాగా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. 
యురేనియం తవ్వకాలపై నిషేదం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎవరికీ ఏవిధమైన అనుమతిని ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చే ఆలోచన తమకు లేదని చెప్పారు. అసెంబ్లీలో యురేనియం చర్చ సందర్భంగా యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ ప్రభు త్వ వైఖరిని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వబోమని పేర్కొన్నారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్తే కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆంధ్రాలోని కడప ప్రాంతంలో యురేనియం తవ్వకాలు మొదలయ్యాయని తెలిపారు.రైతాంగానికి అన్నంపెట్టే కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు, డెల్టా ప్రాంతం మొత్తం కలుషితమై నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని కూడా తీసుకోలేని ప్రమాదం ఏర్పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దీనిపై కేంద్రం ఒకవేళ గట్టిగా ఉంటే అందరం కలిసి కొట్లాడుదామన్నారు. యురేనియం తవ్వకాల అనుమతులు వద్దంటూ కాంగ్రెస్ కూడా ఇందుకు కలిసి రావాలని సూచించారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మద్దతు తెలుపుతూ ఏకవాక్య తీర్మానంచేసి కేంద్రానికి పంపించాలని కోరారు.

No comments:
Write comments