టిఆర్ఎస్ లో తిరుగుబాటు పర్వం పరిసమాప్తి అయ్యిందా?

 

రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ
హైదరాబాద్, సెప్టెంబర్ 16, (globelmedianews.com);
బుజ్జగింపులతో టిఆర్ఎస్ లో తిరుగుబాటు పర్వం పరిసమాప్తి అయ్యిందా?లేక లోలోపల రగులుతుందా అన్నది సెప్టెంబర్ 17 న తేలనుంది.ఒకవైపు టిఆర్ఎస్ నుండి భారీ చేరికలు ఉంటాయని,17 సెప్టెంబర్ నా అద్భుతం జరుగుతుందని  చెప్పుకొస్తున్నాయి.టీఆర్ఎస్‌లో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఏం మాట్లాడతాడో అనే టెన్షన్ కేసీఆర్‌కు పట్టుకుంది. పార్టీని, తనను ధిక్కరిస్తూ మాట్లాడే ఎమ్మెల్యేలపై ఏదైనా చర్య తీసుకుందామా అంటే బీజేపీ భూతం వణికిస్తోంది. ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి.ఇలా రోజుకు ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తుండడంతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదట. తమను ఏదన్నా అంటే బీజేపీలోకి వెళ్తామని చాలామంది బెదిరింపులకు దిగుతుండడం కేసీఆర్ కు  కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 
టిఆర్ఎస్ లో తిరుగుబాటు పర్వం పరిసమాప్తి అయ్యిందా?

ఏ సెకండులో ఎవరు పార్టీ నుంచి జంప్ అవుతారో.. ఎవరు తనను ధిక్కరించి మాట్లాడుతారో అనే ఆందోళనలో కేసీఆర్ ఉంటున్నారు ఏమాట్లాడుకున్నారో ఏమో ఆ క్షణం నుంచి కథ సుఖాంతం! ఓవరాల్‌గా తేలిందేమంటే అసంతృప్తుల్ని బుజ్జగించుకోవడమో, కామ్‌గా కూర్సుండిపోవడమో తప్ప కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిఇన్ని రోజులూ గులాబీ బిగ్‌బాస్‌కు భయపడ్డ గులాబీ సైనికులు ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరుగుబాటు భాహుటా ఎగురవేశారు.ప్రాంతీయ పార్టీల్లో ఒక్కరే ఓనర్ ఉంటారు కానీ టీఆర్ఎస్‌లో మాత్రం అందరూ ఓనర్లమే అని చెప్తూ కేసీఆర్ కూడా తమలాంటి ఒక నేత మాత్రమే అని చెప్పకనే చెప్తున్నారు.ఈటలపై ఇక ఈటె విసురుతారని అంతా అనుకున్న సమయానికి ప్రగతి భవన్ నుంచి కబురెళ్లింది. ఈటల వచ్చి కలిశారు. ఎంత పెద్ద నిర్ణయం అయిన సెకనులో తీసుకునే గులాబీ బాస్ ఇప్పుడు తన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న ఒక్క ఎమ్మెల్యేని కూడా ఏమీ వివరణ అడగలేని పరిస్థితి. ఒక పక్క అవినీతి కేసులు, ఇంకో పక్క బలపడుతున్న ప్రతిపక్షాలు, మరో పక్క సొంత పార్టీలో ధిక్కార స్వరాలు, అనాలోచిత నిర్ణయాలతో ఖజానా ఖాళీ ఇవన్నీ కేసీఆర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తనకిక తెలంగాణలో తిరుగులేదు.. యువరాజుకు పట్టాభిషేకం తరువాయి అనుకుంటున్న సమయంలోనే కేసీఆర్‌కు ఊహించని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అల్లుడు హరీష్ ఎప్పటికైనా తన కొడుకుకు పోటీ అవుతారు అనుకుని అతన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేసిన బాస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో మొదటికే మోసం వస్తుందని గ్రహించి మళ్ళీ అతన్నికేబినెట్‌లోకి తీసుకున్నారు.అవినీతి ఆరోపణలు చేయించి ఈటల రాజేందర్ మంత్రి పదవి తీసేద్దాం అని వ్యూహం రచించిన గులాబీ అధినేతకు ‘నేను గులాబీ జెండాకు ఓనర్నీ’ అని ఈటల చేసిన కామెంట్స్‌తో ఉలిక్కిపడాల్సిన ఇబ్బందికర పరిస్థితి. అందుకే అతన్ని సాగనంపుదామని అనుకున్నా టచ్ చేయలని పరిస్థితి.ఇక మరో ఎమ్మెల్యే రసమయి కూడా ఈటలకు మద్దతు ఇచ్చి గులాబీ బాస్‌కు వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడినా కనీసం వివరణ కూడా అడగలేదు.తన మీద అవినీతి ఆరోపణలు చేసి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన రోజు కూడా నోరు విప్పని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఇప్పుడు కేసీఆర్‌పై బాణం ఎక్కుపెట్టారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారంటూ డైరెక్ట్‌గా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తాను కూడా ఓనర్నీ, కిరాయి గాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే బయటకు వెళ్ళిపోతారు.. అని కేటీఆర్ టార్గెట్‌గా కామెంట్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి బీజేపీలోకి వెళ్తానని బెదిరించారని తెలిసింది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన కనీసం సభకు కూడా హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా సభకు హాజరు కానని అని తెగేసి చెప్పేశారట. మాజీ మంత్రి జోగు రామన్న తన గన్మెన్‌లను తిప్పి పంపించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా విష్యం తెలిసిందే.ఇంకో 30 మంది ఎమ్మెల్యేు కేసీఆర్‌ను ధిక్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదిక రావడంతో గులాబీ బాస్ ట్రబుల్ షూటర్ హరీష్‌ను మళ్ళీ పక్కకు చేర్చుకున్నాడు. ఇదే విషయం పై ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ ‘మాకు తెలుసు ఆ కుటుంబం అంతా ఒక్కటే, హరీష్ కూడా ఆ తాను ముక్క అని తెలియదా.. మా పోరాటం కూడా ఆ కుటుంబం పైనే ఉంటుంది’ అని మాట్లాడారు.ఇన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టి లొంగదీసుకువడం, పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులిచ్చి చేర్చుకోవడం, పార్టీలను విలీనం చేసుకోవడం.. ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఎదురువుతున్న పరిస్థితులు ఖర్మ ఫలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

No comments:
Write comments