పాణ్యం స్పందన కార్యక్రమానికి భారీగా ప్రజలు

 

కర్నూలు సెప్టెంబర్ 9 (globelmedianews.com)
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మొదలు పెట్టిన స్పందన కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో వినూత్నంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా స్పందన నిర్వహిస్తున్నామని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. సోమవారం నిర్వహించిన పాణ్యం నియోజకవర్గ స్పందనకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అయన అన్నారు. 
పాణ్యం స్పందన కార్యక్రమానికి భారీగా ప్రజలు

పాణ్యం నియోజకవర్గ కేంద్రం శ్రీకృష్ణ మందిరంలోజిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జెసి రవి పట్టన్ శెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్ లు స్పందన అర్జీలను  స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల అధికారులు హజరయ్యారు. మరోవైపు, పాణ్యం నియోజకవర్గం కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలు, గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు.

No comments:
Write comments