తీహార్ జైలుకు డీకే శివకుమార్‌ తరలింపు

 

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19  (globelmedianews.com)
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. మనీలాండరింగ్ కేసులో డీకేను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ కోర్టు డీకేకు అక్టోబర్1 వరకూ రిమాండ్ విధించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. ఆంజియోప్లాస్టీ చేయించుకున్న డీకే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 
తీహార్ జైలుకు డీకే శివకుమార్‌ తరలింపు

మనీ లాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్న ఆయన రెండు వారాలుగా కస్టడీలోనే ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ధ్రువీకరించడంతో తీహార్‌ సెంట్రల్‌ జైలుకు ఆయనను గురువారం ఉదయం తరలించారు.డీకే మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో బెళగావి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్‌ ఈడీ ఎదుట గురువారం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ ఆర్థిక మంత్రికాంగ్రెస్ నేత చిదంబరం కూడా తీహార్ జైలులోనే ఉండటం గమనార్హం.

No comments:
Write comments