ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు

 

కర్నూలు, సెప్టెంబర్ 10, (globelmedianews.com)
దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కల నెరవేరనుంది. దేశ చరిత్రలో తొలి సారి ఓ కార్పొరేషన్‌ ప్రభుత్వంలో విలీనమవుతోంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత విషయంలో అభద్రతాభావంలో ఉన్న ఆర్‌టిసి ఉద్యోగులకు నిజంగా ఒక వరమే. వైఎస్‌ జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఇటీవల మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా 52వేల మంది ఆర్‌టిసికార్మికులకు, జిల్లాలో 3,914 మందికి ప్రయోజనం కలుగనుంది.కర్నూలు జిల్లాలో ఆర్‌టిసి డిపోలు 12లో 896 బస్సులు ఉన్నాయి. వీటిలో 213 అద్దె బస్సులు ఉండగా, 683 సంస్థసర్వీసులున్నాయి. ఆర్‌టిసి స్టోర్లు 3, సిబ్బంది మొత్తం 3,914 మంది ఉన్నారు. ఆర్‌టిసి సంస్థ ఎప్పుడూ నష్టాల్లో ఉండడం వల్ల తమ ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో అనే అభద్రతా భావంలోఉద్యోగులు ఉన్నారు. సంస్థలో కార్మికులు, ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తూ అభద్రతాభావంలోకి నెట్టారు. 
ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు

కార్మికులు తప్పులపై విచారణ చేయకుండానే శిక్షలు విధిస్తున్నారన్నవిమర్శలున్నాయి. దీనికి తోడు కార్మికులకు, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం లభించడం లేదు. నిబంధనల ప్రకారం 8 గంటలే పనిచేయాలని ఉన్నా ఎక్కువ గంటలుపనిచేయించుకోవడం, అందుకు తగిన వేతనం ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేయడం నిత్యం జరిగేతంతు. వైసిపి ప్రభుత్వం ఆర్‌టిసి సిబ్బందిని ప్రభుతంలోకి విలీనం చేయడం వల్ల ఉద్యోగభద్రత లభిస్తుందని, వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగ సర్వీసు మరో రెండేళ్లు పెరుగుతుందని, పని సమయాలు బాగుంటాయని, ఒత్తిడి ఉండదని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు డిపోల్లోసంబరాలు జరుపుకున్నారు.నష్టాల పేరుతో సర్వీసులు ఎత్తివేయడం ఉండదు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలుగుతుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు వస్తాయి. ఆర్టీసీలోఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యా, వైద్యం లాగానే ఆర్టీసీకి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరుగుతాయి. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలుఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల లాగానే విరమణ వయోపరిమితి 58 నుంచి 60కు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ విధానం మెరుగుపడుతుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనంఅయినప్పటికీ ఆ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌గానే కొనసాగుతుంది. ప్రైవేటుతోపాటు ప్రజల భాగస్వాయ్యం ఉంటుంది కాబట్టి గుత్తాధిపత్యం ఉండదు. ఆర్టీసి ఆస్తులన్నీ ఆసంస్థ పరిధిలోనే ఉంటాయి. వాటికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతమున్న ప్రయోజనాలు, నియమ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. ఇకపైఉద్యోగులకు ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది కాబట్టి నష్టాలు అనే మాట ఉండదు.ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ 1950 యాక్ట్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 70 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 30 శాతంపెట్టుబడులు పెట్టాయి. కేంద్రానికి 30 శాతం వాటా చెల్లిస్తే ఆర్‌టిసిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారులు వర్తిస్తాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన బైపర్‌ కేషన్‌ పూర్తిగాకాలేదు. అన్ని ఆస్తులను పూర్తిస్థాయిలో విభజించలేదు. అవన్ని తేలేవరకు ప్రస్తుతం ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. ఇలాంటివన్నీ తేలక పోవడంతో ఆర్‌టిసి పూర్తిస్థాయిలోరాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలన్నీ వర్తిస్తాయి.

No comments:
Write comments